ఏపీలో లక్షలాది ఉద్యోగాల జాతర.. కియా, గూగుల్, ఎల్జీ, కాగ్నిజెంట్‌ భారీ పెట్టుబడులు..

Andhra Pradesh Job Boom: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, సాంకేతిక ముఖచిత్రం వేగంగా మారుతోంది. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 వేదికగా అంతర్జాతీయ టెక్, ఆటోమొబైల్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు రావడంతో యువతకు వేలాది కొత్త ఉద్యోగ అవకాశాల ద్వారాలు తెరుచుకున్నాయి. గూగుల్, కాగ్నిజెంట్, ఎల్‌జి, కియా వంటి దిగ్గజ సంస్థల విస్తరణ ప్రణాళికలు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి పెట్టుబడుల గమ్యస్థానంగా నిలుపుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్‌ఆర్‌డి శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోకి వస్తున్న ప్రతిష్ఠాత్మక పెట్టుబడుల వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు.. భారతదేశంలోని డేటా సెంటర్ రంగంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా (FDI) నిలవనుందని ఆయన తెలిపారు.

Andhra Pradesh jobs Kia 12000 jobs Kia Andhra Pradesh expansion Kia second manufacturing plant Kia 2 billion investment Cognizant 25000 jobs Cognizant innovation centre Andhra Pradesh LG 5000 crore investment Google 15 billion investment Andhra Pradesh investment summit 2026 AP industrial development Vizag investment boom Andhra Pradesh employment opportunities 12000

అలాగే ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తన నూతన ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా రాష్ట్రంలో ఏకంగా 25,000 కొత్త ఉద్యోగాలను సృష్టించనుండగా.. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జి రూ. 5,000 కోట్ల పెట్టుబడితో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. దీనికి తోడు, విశాఖపట్నాన్ని ఏఐ (AI) మరియు డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

మరోవైపు ఆటోమొబైల్ రంగంలోనూ రాష్ట్రానికి భారీ ఊతం లభించింది. దక్షిణ కొరియా వాహన తయారీ దిగ్గజం కియా (Kia), ఆంధ్రప్రదేశ్‌లో రెండవ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు అదనంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్గు లీ సదస్సులో ప్రకటించారు. ఈ విస్తరణ ద్వారా సుమారు 12,000 కొత్త ఉద్యోగాలు లభించడంతో పాటు, సంస్థ వార్షిక వాహన ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4.30 లక్షల నుండి 6 లక్షల యూనిట్లకు పైగా చేరుకోనుంది. ఇది అనంతపురం ప్రాంతంలో ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమల వృద్ధికి మరింత బలాన్ని చేకూర్చనుంది.

Also Read

ఇదే సదస్సులో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు దేశ విమానయాన రంగ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ప్రపంచ సరఫరా గొలుసులు మారుతున్న తరుణంలో అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం తన ప్రధాన అజెండాగా మార్చుకుందని అన్నారు. నూతన 'ఉడాన్' (UDAN) కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను నిర్మించి ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండటం రాష్ట్ర ఎగుమతులు, పర్యాటక రంగాలకు గేమ్ ఛేంజర్‌గా మారనుందని పేర్కొన్నారు.

అలాగే, గ్లోబల్ సౌత్ దేశాలతో వాయు అనుసంధానాన్ని పెంచడంతో పాటు, ఔషధాలు, త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం వాయు సరుకు రవాణా (Air Cargo) నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు నాయుడు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా.. రాబోయే రెండేళ్లలో భారతదేశం సొంతంగా పౌర విమానయాన విమానాలను (Civilian Aircraft) అభివృద్ధి చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్నామని ఆయన ప్రకటించారు. మొత్తంగా, భారీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనతో ఆంధ్రప్రదేశ్ నూతన ఆర్థిక శకానికి నాంది పలుకుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+