మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో పరుగులు తీస్తోంది. మొదటి మూడు నెలల్లోనే 10.5% వృద్ధి సాధించింది. ఇది దేశ సగటు 8.8% కంటే ఎక్కువ. దాంతో జోష్‌లోకి వెళ్లిన సీఎం చంద్రబాబు, "ఇక్కడ ఆగిపోవద్దు... వచ్చే ఏడాదికి 17% వృద్ధి దిశగా కదలాలి" అంటూ అధికారులకు క్లియర్ డైరెక్షన్ ఇచ్చేశారు.

ఏ ఫీల్డ్ లో వృద్ధి పెరిగింది అంటే పరిశ్రమలే ముందంజలో ఉన్నాయి. ఈసారి ఆ రంగం "11.91% వృద్ధి" సాధించింది. మైనింగ్ నుంచి మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్ వరకూ బాగా రాణించాయి. తర్వాత సర్వీసులు కూడా వెనుకాడలేదు. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ ఇలా అన్నీ కలిపి "10.70% వృద్ధి" సాధించాయి. ఇక రైతులు కూడా తగ్గేది లేదంటూ వ్యవసాయాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ఆ రంగంలో ఏపీ 9.60% వృద్ధి సాధించింది. పశుసంవర్థకంలో నుంచి చేపల ఉత్పత్తి వరకూ పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి.
పశుసంవర్థకం స్థిరంగా 6.65% గ్రోత్ రాబట్టింది. కానీ అసలైన బ్లాస్ట్ మాత్రం చేపల, ఆక్వా రంగంలో జరిగింది. ఏకంగా 14.52% వృద్ధి నమోదు చేసి, దాదాపు రూ. 32,110 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇది చిన్న అక్వా ఫార్మర్లకైనా, పెద్ద ఆక్వా ప్రాజెక్టులకైనా ఒక బూస్ట్ లాంటిదే.
ఇక మాంసం, గుడ్ల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరగడంతో, రైతులకే కాదు, గ్రామీణ కుటుంబాల ఆదాయానికీ డైరెక్ట్‌గా లాభం కలిగింది. అంటే ఫుడ్ ప్రొడక్షన్ పెరిగింది, మార్కెట్‌లో డిమాండ్ కూడా హైగా ఉంది. రెండూ కలిసి రైతుల జేబులో అదనపు ఇన్‌కమ్ జమయ్యేలా చేశాయి. అగ్రికల్చర్ రంగం ఈసారి డబుల్ ఇంపాక్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఉత్పత్తి పెరిగింది, రైతు ఆదాయం కూడా పెరిగింది.
పరిశ్రమలు, మౌలిక వసతుల రంగం ఈసారి బాగానే దూసుకెళ్లింది. మొదట మైనింగ్ ఇది ఏకంగా 43.54% వృద్ధి సాధించింది. అంటే రాష్ట్రంలో సహజ వనరుల వినియోగం బలంగా పెరిగిందనే అర్థం. ఇక మాన్యుఫాక్చరింగ్ రంగం 9.93% వృద్ధి సాధించగా, కన్స్ట్రక్షన్ రంగం కూడా 9.57% పెరిగింది. ఈ నెంబర్లు చూస్తే ఒక్క విషయం క్లియర్ రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వేగంగా నడుస్తున్నాయి. అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ పెరిగి, ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఎక్కువన్నమాట.
సర్వీసుల రంగంలో మంచి వృద్ధి కనిపిస్తోంది. హోటల్స్, రెస్టారెంట్లు, ట్రేడ్ సంబంధిత వ్యాపారాలు సుమారుగా 17.92% పెరిగాయి. టూరిజం రంగం కూడా మంచి జోరులో ఉంది, పర్యాటకుల సంఖ్య 6.89 కోట్ల నుంచి 8.07 కోట్ల వరకు చేరింది. అంతేకాదు, ఎయిర్ ప్యాసింజర్స్ కూడా 21% పెరగడం సానుకూల సంకేతం అని చెప్పవచ్చు. మొత్తం చూస్తే, సర్వీసులు రంగంలో పాజిటివ్ ట్రెండ్ స్పష్టంగా ఉంది.
సీఎం అభిప్రాయం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న "దీర్ఘ తీరరేఖ, పోర్టులు, సహజ వనరులు, ఆక్వా బేస్" వంటివి బలమైన పాయింట్స్. వీటిని సరిగ్గా వినియోగిస్తే, రాష్ట్రం 25% వరకు వృద్ధి సాధించే స్థాయిలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. వృద్ధి గణాంకాలు బాగున్నప్పటికీ, 17% వృద్ధి టార్గెట్ చేరుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు అవసరం. ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లను వేగంగా పూర్తి చేయడం, వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం, అలాగే సర్వీసులను మరింత బలోపేతం చేయడం ముఖ్యమని చెప్పాలి.
ఒక మాటలో చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు "గ్రోత్ రేస్"లో స్పీడ్ పెంచేసింది. ఈ వేగం కొనసాగితే, రాష్ట్రం నిజంగానే దేశంలో టాప్ ఎకానమీస్‌లో ఒకటిగా మారొచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications