Andhra Pradesh లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం ఐదు ముఖ్యమైన బిల్లులను ఆమోదించింది. ఇవి కార్మికుల పని గంటలు, వాహనాలపై గ్రీన్ టాక్స్, మహిళల ఉపాధి, దుకాణాలు & స్థాపనల నిబంధనలు, అలాగే భిక్షాటన నివారణ, షెడ్యూల్డ్ తెగల కమిషన్‌కు సంబంధించిన సవరణలకు సంబంధించిన బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఫ్యాక్టరీలు (సవరణ) బిల్లు, 2025 : ఏపీ ప్రభుత్వం కార్మికులకు పనిగంటలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కార్మికులు రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయగా.. ఇప్పుడు ఈ పరిమితిని 10 గంటలకు పెంచారు. దీనికి సంబందించిన బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. అయితే, వారానికి 48 గంటల గరిష్ట పరిమితి మాత్రం అలాగే ఉంటుంది. అంటే, మొత్తం పని గంటలు పెరగదు కానీ గంటల పంపిణీ మారనుంది. రాత్రి షిఫ్టుల్లో కూడా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

అయితే భద్రత, రక్షణ చర్యలు తప్పనిసరిగా ఉండాలి. అదనపు పని చేస్తే ఓవర్ టైమ్ చెల్లించాల్సిందే. అలాగే విశ్రాంతి సమయాలు కూడా తప్పనిసరి అని తెలిపింది. దీనికి సంబంధించి ఏపీ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు-2025, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు-2025 లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శాసనసభలో ప్రవేశపెట్టగా..సభ్యులు ఆమోదం తెలిపారు.
AP మోటార్ వాహనాల పన్ను (సవరణ) బిల్లు, 2025: పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మోటారు వాహనాల ట్యాక్సేషన్ చట్టంలో సవరణలు చేస్తూ ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ అసెంబ్లీ సభ్యులకు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం.. భారీ వాణిజ్య వాహనాల (HCVs) యజమానులపై ఉన్న గ్రీన్ టాక్స్‌ను తగ్గించారు. 12 సంవత్సరాల లోపు పాత వాహనాలకు గ్రీన్ టాక్స్ ఇప్పటివరకు రూ.3,000, రూ.10,000, రూ.16,000 వసూలు చేస్తుండగా, ఇప్పుడు అన్ని వాహనాలకు ఒకేలా రూ.1,500గా నిర్ణయించారు. ఇక 12 సంవత్సరాల కంటే పైబడిన వాహనాలకు రూ.3,000, రూ.6,000, రూ.20,000 వసూలు చేస్తుండగా, ఇప్పుడు ఒకే రేటు రూ.3,000 గా నిర్ణయించారు. దీని వలన వాహన యజమానులకు కొంత ఉపశమనం లభిస్తుంది.
సాధారణంగా లారీలు, బస్సులు వంటి పెద్ద వాహనాలకు ఏడు సంవత్సరాలు పూర్తయ్యాక ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే గ్రీన్ ట్యాక్స్ (హరిత పన్ను) తప్పనిసరిగా చెల్లించాలి. ఈ పన్ను వాహనం రకం (లారీ, బస్సు మొదలైనవి) మరియు వయసు ఆధారంగా వసూలు చేస్తారు. కనీసం రూ. 800 నుంచి గరిష్టంగా రూ. 20 వేల వరకు ఉండేది. ఈ గ్రీన్ ట్యాక్స్ ద్వారా వాహన యజమానులు చెల్లించే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేక ఆదాయ వనరుగా ఉంది.
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో సగటున సంవత్సరానికి రూ.5 కోట్ల వరకు మాత్రమే రాగా, 2022-23లో గ్రీన్ ట్యాక్స్ ద్వారా భారీగా పెరిగి రూ. 89.96 కోట్లు ఆదాయం వచ్చింది.2023-24లో మరింత పెరిగి సుమారు రూ. 102.94 కోట్లు చేరింది. కాగా దేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి లేదా నియంత్రించడానికి, ప్రభుత్వం కార్లు, బైక్‌లపై గ్రీన్ టాక్స్‌ను ప్రవేశపెట్టింది.
షాపులు & స్థాపనలు (సవరణ) బిల్లు, 2025 : ఈ బిల్లు ద్వారా దుకాణాలు, చిన్న వ్యాపారాలకు ఎక్కువ కార్యాచరణ సౌలభ్యం లభిస్తుంది. రోజువారీ పని గంటలను 8 నుండి 10 గంటలకు పెంచినా, వారానికి 48 గంటల పరిమితి అలాగే కొనసాగుతుంది. విశ్రాంతి విరామాలను సులభతరం చేశారు. ఉదాహరణకు 6 గంటల పని తరువాత 30 నిమిషాల విరామం ఉంటుంది.మహిళలకు కూడా రాత్రిపూట పనిచేసే అవకాశం కల్పించారు, కానీ భద్రతా చర్యలు తప్పనిసరి. 20 మందికి తక్కువ మంది కార్మికులు పనిచేసే దుకాణాలకు ఎక్కువ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుంది.
AP భిక్షాటన నివారణ (సవరణ) బిల్లు, 2025: పాత చట్టంలో ఉపయోగించిన 'కుష్టురోగి', 'వెర్రివాడు' వంటి అవమానకర పదాలను తొలగించారు. దీని వలన వికలాంగులు, కుష్టు వ్యాధి బాధితుల పట్ల ఉన్న వివక్షత తగ్గుతుంది.వివక్షాత్మక పదాలను చట్టాల నుంచి తొలగించడం ద్వారా సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లయింది.
AP స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ తెగలు (సవరణ) బిల్లు, 2025: షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్, సభ్యులకు ఉన్న గరిష్ట వయోపరిమితిని తొలగించారు.ఇకపై వారు నియమావళి ప్రకారం పదవిలో కొనసాగవచ్చు. ఒకసారి నియమించాక వారు 2 సంవత్సరాల కాలం పాటు పదవిలో ఉంటారు. అవసరమైతే మరో 2 సంవత్సరాలు పొడిగించవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications