ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లాకు, కుటుంబానికి అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు అనన్య బిర్లా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా తమపట్ల సదరు రెస్టారెంట్ యజమానులు జాతి వివక్ష చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలోని ఇటాలియన్-అమెరికన్ రెస్టారెంట్ నుండి తమను గెంటివేసినంత పనిచేశారని మండిపడ్డారు. తనను, తన కుటుంబాన్ని ఆ రెస్టారెంట్ పరిసరాల నుండి గెంటేసినంత పని చేసి, దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు.
ఇది సరైంది కాదు...
ఇక్కడి స్కోపా రెస్టారెంట్ నిర్వాహకులు తనను, తన కుటుంబాన్ని బయటకు గెంటివేశారని, జాతి వివక్షను ప్రదర్శించారని అనన్య బిర్లా తెలిపారు. ఇది నిజంగా విషాదకరమని, కస్టమర్ల పట్ల ఈ వైఖరి సరికాదని, మీ రెస్టారెంట్‌లో భోజనం చేయడానికి తాము మూడు గంటలు ఎదురుచూశామని, కానీ, మీ వెయిటర్ జోషువా సిల్వర్‌మాన్ తమ అమ్మతో దురుసుగా ప్రవర్తించారని, జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఏమాత్రం సరికాదని, ఇది జాతి వివక్ష అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మీరు మీ కస్టమర్లతో సరిగ్గా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు.
వీరిదీ అదే మాట...
అనన్య బిర్లాతో పాటు నీర్జా బిర్లా కూడా రెస్టారెంట్ తీరు పట్ల ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. రెస్టారెంట్‌లో తమ పట్ల వ్యవహరించిన తీరు తమను షాక్‌కు గురి చేసిందని, ఏ కస్టమర్ పట్ల కూడా ఇలా వ్యవహరించే హక్కు మీకు లేదని నీర్జా బిర్లా ట్వీట్ చేశారు.
తనకు ఎప్పుడు ఈ విధమైన అనుభవం ఎదురు కాలేదని, ఈ జాత్యాహంకారం దారుణమని ఆర్యమాన్ బిర్లా అభిప్రాయపడ్డారు.

ఫ్యామిలీతో వెళ్లినప్పుడు
బిలియనీర్ ఆదిత్య బిర్లా, ఎడ్యుకేషనలిస్ట్, మెంటల్ హెల్త్ యాక్టివిస్ట్ నీర్జా బిర్లా కూతురు అనన్య బిర్లా. గాయనిగా, ఆర్టిస్టుగా సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. శనివారం తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో పాటు కాలిఫోర్నియాలోని రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు వారికి చేదు అనుభవం ఎదురైంది. దీంతో సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications