వీడియో: దివ్యాంగుల కోసం మోటార్‌బైక్ వీల్‌ఛైర్: గేమ్ ఛేంజర్: ఆనంద్ మహీంద్రా
ముంబై: ఆనంద్ మహీంద్రా.. పరిచయం అక్కర్లేని దేశీయ పారిశ్రామిక దిగ్గజం. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు అధినేత. రోజువారీ వ్యాపార కార్యకలాపాలతో క్షణం తీరిక లేకుండా ఎలా గడుపుతూ ఉంటారో.. ట్విట్టర్‌లో కూడా అదే స్థాయిలో యాక్టివ్‌గా ఉంటారాయన. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎలాంటి భేషజాలను ప్రదర్శించారు. ఎదుటి వారిని మరింత ఎంకరేజ్ చేసేలా ఆయన ట్వీట్లు చేస్తుంటారు. చాలామందికి తన ట్వీట్ల ద్వారా ఆయన స్ఫూర్తినిస్తుంటారు. ఆయనకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య ఎనిమిదిన్నర మిలియన్లు.
తాజాగా- ఓ వీడియో క్లిప్‌ను ఆనంద్ మహీంద్రా తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మోటార్‌సైకిల్ వీల్‌ఛైర్ అది. దివ్యాంగుల కోసం దీన్ని డెవలప్ చేశారు. వీల్‌ఛైర్‌లో కూర్చున్న ఓ వ్యక్తి.. ఫ్రంట్ వీల్, ఇంజిన్ ఉన్న బైక్ హ్యాండిల్‌ను దానికి క్లిప్ చేసుకుంటాడు. దాన్ని బైక్ తరహాలో నడిపిస్తాడు. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఆనంద్ మహీంద్రాకు చేరింది. దాన్ని ఆయన ఇన్‌స్పైర్ అయ్యారు. ఒకరికి స్ఫూర్తి నింపే ఆనంద్ మహీంద్రా.. ఈ వీడియోను చూసి తాను స్ఫూర్తిని పొందారు.
మోటార్‌సైకిల్ వీల్‌ఛైర్ అనేది గొప్ప ఆలోచనగా ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఈ విషయంలో ఆయన ఎలాంటి బేషజాలకు పోలేదు. దివ్యాంగుల జీవితాన్ని మార్చేదిగా అభివర్ణించారు. ఈ ఇన్నోవేషన్ ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని కితాబిచ్చారు. ఆ వీడియో క్లిప్ ఎప్పుడు షూట్ చేశారో, ఆ మోటార్‌సైకిల్ వీల్‌ఛైర్‌ను ఎవరు తయారు చేశారనేది కూడా తనకు తెలియట్లేదని, రాండమ్‌గా తనకు అందిందని వివరించారు. దివ్యాంగుల జీవితాలను పరుగులు పెట్టించే అద్బుతమైన ఆవిష్కరణగా ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. దివ్యాంగుల జీవితాల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని వ్యాఖ్యానించారు.
ఏ రకంగానైనా సరే.. ఏ విధంగానైనా సరే.. సపోర్ట్ అందుకునే అర్హత ఈ ఆవిష్కరణకు ఉందని వ్యాఖ్యానించారు. దీనికి తనవంతు సపోర్ట్ చేయడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్‌లో దీన్ని షేర్ చేసిన వెంటనే పలువురు నెటిజన్లు స్పందించారు. ఇలాంటి మోటార్‌సైకిల్ వీల్‌ఛైర్లను పెద్ద ఎత్తున తయారు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓ మోస్తరు ఆర్థిక స్థోమత ఉన్న వికలాంగులు దీన్ని కొనుగోలు చేయడానికి వెనుకాడబోరని అన్నారు. కొన్ని బడా కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీన్ని కొనుగోలు చేసి.. పేద వికలాంగులకు విరాళంగా ఇవ్వడానికీ అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

స్వచ్ఛంద సంస్థలు కూడా స్పాన్సరర్ల ద్వారా మోటార్‌సైకిల్ వీల్‌ఛైర్మను విరాళాల రూపంలో దివ్యాంగులకు అందించడానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. నగరాల్లో ఇలాంటి వీల్‌ఛైర్లను నడిపించడానికి అవసరమైన రోడ్డు సౌకర్యం ఉండదని మరి కొందరు ట్విట్టరెట్టీలు పేర్కొన్నారు. చాలా నగరాల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వీధి వ్యాపారులు తమ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారని చెప్పారు. పార్కుల్లో తప్ప రోడ్ల మీద నడిపించే పరిస్థితి లేదని అన్నారు. ఇలాంటి మోటార్‌సైకిల్ వీల్‌ఛైర్లు అందుబాటులో వచ్చిన తరువాత వాటి కోసం ప్రత్యేకంగా పాత్ వేను సృష్టించాల్సి ఉంటుందని పలువురు నెటిజన్లు, ట్విట్టరెట్టీలు అభిప్రాయాలను పంచుకుంటోన్నారు.


Click it and Unblock the Notifications