Tata-Airbus:టాటా, ఎయిర్‌బస్ మధ్య ఒప్పందం.. ఇండియాలోనే హెలికాప్టర్ల తయారీ..
టాటా గ్రూప్, ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ హెలికాప్టర్‌లను తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా శుక్రవారం తెలిపారు. స్వదేశీ, స్థానికంగా హెలికాప్టర్లు తయారు చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా చేసిన అనేక వాగ్దానాలలో భాగంగా రెండు సంస్థలు H125 హెలికాప్టర్లను తయారు చేయడానికి ఈ ఒప్పందం చేసుకున్నాయి.
ఈ ఒప్పందం ఫ్రాన్స్, భారతదేశం మధ్య పెరుగుతున్న సంబంధాలు, ముఖ్యంగా రక్షణ, అణుశక్తి, అంతరిక్షంలో దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదపడనున్నాయి. 2023లో మోదీ ఫ్రాన్స్‌లో బాస్టిల్ డే వేడుకలకు హాజరయ్యారు, ఈ సందర్భంగా అదనపు జలాంతర్గామి కొనుగోళ్లు, రాఫెల్ యుద్ధ విమానాల ప్రణాళికలను ఆవిష్కరించారు.

వారు వడోదర సౌకర్యం వద్ద కనీసం నలభై C-295 రవాణా విమానాలను తయారు చేయనున్నారు. దీనిని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) పర్యవేక్షించనుంది. ప్రధాన కాంపోనెంట్ అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ హార్నెస్‌ల ఇన్‌స్టాలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్‌లు, ఫ్లైట్ కంట్రోల్స్, డైనమిక్ కాంపోనెంట్స్, ఫ్యూయల్ సిస్టమ్, ఇంజన్‌ల అసెంబుల్ చేయనున్నారు.
"దేశ నిర్మాణానికి హెలికాప్టర్లు కీలకం. 'మేడ్-ఇన్-ఇండియా' సివిల్ హెలికాప్టర్ నమ్మకమైన న్యూ ఇండియాకు చిహ్నంగా ఉండటమే కాకుండా దేశంలో హెలికాప్టర్ మార్కెట్ యొక్క నిజమైన సామర్థ్యాన్ని అన్‌లాక్ చేస్తుంది" అని ఎయిర్‌బస్ సిఇఒ గుయిలౌమ్ ఫౌరీ అన్నారు. "భారతదేశంలో మొట్టమొదటి హెలికాప్టర్ అసెంబ్లింగ్ సౌకర్యాన్ని ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయడం పట్ల టాటా గ్రూప్ సంతోషిస్తున్నది. ఈ సదుపాయం భారతదేశం, ఎగుమతి మార్కెట్ల కోసం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎయిర్‌బస్ H125 సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ కోసం ఎయిర్‌బస్ భాగస్వామ్యంతో చివరి అసెంబ్లీ లైన్‌ను కలిగి ఉంటుంది" అని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అన్నారు.


Click it and Unblock the Notifications