ముంబై: బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ నేమ్.. వేల కోట్ల రూపాయలను పలుకుతోంది. ఆయన నటించే సినిమాలు మొదలుకుని అడ్వర్టయిజ్‌మెంట్ల దాకా ప్రతిదీ వందల కోట్ల రూపాయలను ఆర్జించి పెట్టేవే. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. ఈ వయస్సులో కూడా తన పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ద్వారా ప్రతినెలా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. సోనీలో టెలికాస్ట్ అయ్యే కౌన్ బనేగా కరోడ్‌పతి ద్వారా వచ్చే ఆదాయం అత్యధికం.
ఇక సినిమాలు, వాణిజ్య ప్రకటనల్లో నటించడం ద్వారా వచ్చే రాబడితో ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. తాజాగా- స్టేట్ బ్యాంక్ ఇండియా నుంచి ఆయనకు లక్షలాది రూపాయల మేర ఆదాయం అందుతోంది ప్రతినెలా. దీనికి కారణం- ముంబైలో అత్యంత కమర్షియల్ ప్రాంతంలో ఉండే రెండు బంగళాలను ఆయన స్టేట్ బ్యాంక్ ఇండియాకు లీజుకు ఇవ్వడమే. అమితాబ్ బచ్చన్ తన కుటుంబంతో కలిసి ముంబై జుహు ప్రాంతంలో నివసిస్తున్నారు.

అదే ఏరియాలో ఆయనకు రెండు బంగళాలు ఉన్నాయి. వాటి పేర్లు- వత్స, అమ్ము. 3,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు వాటిని. ఈ రెండు బంగళాల గ్రౌండ్ ఫ్లోర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీజుకు తీసుకుంది. దీనికోసం అమితాబ్ బచ్చన్‌కు ప్రతి నెలా 18.90 లక్షల రూపాయలను అద్దె రూపంలో చెల్లిస్తుంది. ఇదివరకు ఇదే గ్రౌండ్ ఫ్లోర్‌లో సిటీబ్యాంక్ అద్దెకు ఉండేది. 2019 జూన్‌లో లీజు కాల పరిమితి ముగియడంతో సిటీబ్యాంకు దీన్ని ఖాళీ చేసింది.
ఆ తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీజుకు తీసుకుంది. లీజు కాల పరిమితి 15 సంవత్సరాలుగా నిర్ధారించారు. ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి 25 శాతం అద్దె పెంచుకునేలా అగ్రిమెంట్ కుదిరింది. దీని ప్రకారం2.26 కోట్ల రూపాయలను స్టేట్ బ్యాంక్ ఇండియా అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఓ రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్ తెలిపింది. ఇదే జుహూ ప్రాంతంలో కమర్షియల్ భవనాల అద్దె ఒక చదరపు అడుగునకు 450 రూపాయల నుంచి 650 రూపాయల వరకు ఉంటోంది. ఇండిపెండెంట్ బంగళాల అద్దె కోట్ల రూపాయల్లోనే
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications