Union Budget 2025: మరోవారం రోజుల్లో డిసెంబర్ నెల ముగియనుంది. ఈ క్రమంలో కొత్త ఏడాది కొత్తగా కేంద్రం తీసుకొచ్చే బడ్జెట్ పై సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అనేక వర్గాలకు చెందిన వ్యక్తులు కోటి ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో నిపుణులు సైతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తమ తరఫు నుంచి ఆర్థిక సంస్థను మెరుగ్గా ముందుకు నడిపించటానికి మెరుగైన సూచనలు, సలహాలను అందిస్తున్నారు.
ప్రస్తుతం రానున్న బడ్జెట్ 2025లో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని, కస్టమ్స్ టారిఫ్‌లను హేతుబద్ధీకరించాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కేంద్రం ఎగుమతులను ప్రోత్సహించేందుకు మద్దతుగా చర్యలను ప్రవేసపెట్టాలని వారు సూచిస్తున్నారు. అయితే బడ్జెట్ సమావేశానికి ముందు ప్రధాని మోదీతో బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన చర్చలో నైపుణ్యం, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, మూలధన వ్యయం వేగాన్ని కొనసాగించడంపై తమ అభిప్రాయాలను నొక్కి చెప్పారు. ప్రభుత్వ విధానంలో ప్రధాన కేంద్రంగా ఉపాధి కల్పనను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు.

ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆర్థిక వేత్తలు చెప్పిన అనేక అంశాలతో పాటు వారి సూచనలను పూర్తిగా విన్నారని అందుబాటులో ఉన్న సమాచారం. అలాగే ప్రధాని వికసిత్ భారత్ పై ఫోకస్ కొనసాగించారని, ఇండియాను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందే స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ ఆలోచనలను కలిగి ఉండాలని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన వివరాల్లో వెల్లడైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనపై కూడా చర్చ కొనసాగింది. ప్రధానంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా యువతకు అవసరమైన విద్య, ట్రైనింగ్ అందించటంపై కూడా ఇందులో చర్చ జరిగిందని తెలుస్తోంది.
కొత్త ఏడాది బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు బలహీనమైన వినియోగం, మొండిగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం కీలక ఆందోళనలుగా ఉండటంపై కూడా ఆర్థిక నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేశారు. భారతదేశ దేశీయ వినియోగం వాస్తవ వృద్ధికి అనుగుణంగా లేదని వారు చెబుతున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు రెండు సంవత్సరాలలో దాని నెమ్మదిగా వృద్ధి చెందింది. క్రితం ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్‌తో మూడు నెలల్లో స్థూల దేశీయోత్పత్తి 5.4% వృద్ధిని నమోదు చేసింది. వాస్తవానికి అధికంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం గృహ బడ్జెట్‌లను దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు. డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గటంతో ప్రజలు విచక్షణతో ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది. ద్రవ్యోల్బణం అదుపు లేకుండా కొనసాగటాన్ని అనుమతిస్తే.. అది వాస్తవ ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా పరిశ్రమలు, ఎగుమతుల అవకాశాలను దెబ్బతీస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది.
దీనికి ముందు కేంద్ర మంత్రులు సైతం దేశంలో తగ్గిన వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించాలని పిలుపునివ్వగా మరికొందరు మాత్రం కంపెనీలు తమ లాభాలను తగ్గించుకుని తక్కువ మార్జిన్లకు విక్రయించటం ద్వారా ప్రజల నుంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని కామెంట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. కానీ వాస్తవానికి మహమ్మారిలా పట్టి పీడిస్తున్న ద్రవ్యోల్బణం ప్రజలను విచక్షణతో ముందుకు సాగేలా ప్రేరేపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications