Anil Ambani: పడుతున్న మార్కెట్లలోనూ పరిగెడుతున్న అనిల్ అంబానీ స్టాక్.. మీరూ కొన్నారా..?
Reliance Power: గడచిన రెండు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొడుకుల మధ్య నష్టాలను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి రానున్న వారంలో ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉన్నందున దీనికి ముందు మార్కెట్లు కొంత జాగ్రత్తలో ముందుకు సాగుతున్నాయి.
ఈ క్రమంలో భారతీయ ఈక్విటీ మార్కెట్‌లో భూకంపం వచ్చినప్పటికీ.. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లలో శుక్రవారం రాకెట్ దూకుడు కనిపించింది. వాస్తవానికి ఇటీవలి కాలంలో అనిల్ అంబానీకి చెందిన అనేక కంపెనీ షేర్ల పరిస్థితి సైతం ఇలాగే ఉంది. వాస్తవానికి ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ముగింపు రోజున సెన్సెక్స్ సూచీ ఏకంగా 856 పాయింట్లు నష్టపోయినప్పటికీ రిలయన్స్ పవర్ షేర్లు మాత్రం వీటికి పూర్తిగా భిన్నంగా 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.35.57 వద్ద స్థిరపడింది. వాస్తవానికి ఇది 52 వారాల సరికొత్త గరిష్ఠం.

వాస్తవానికి కంపెనీ షేర్ల ధర 23 మే 2008న రూ.274.84 వద్ద ఉన్నాయి. దీని తర్వాత రిలయన్స్ పవర్ స్టాక్ 99 శాతం ధరలో పతనాన్ని చూసి ఏకంగా రూ.1.13కి చేరాయి. అయితే అక్కడి నుంచి స్టాక్ తేరుకుని గడచిన నాలుగేళ్లలో 2960 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే గడచిన 9 రోజుల్లో ఇన్వెస్ర్టర్లకు 29 శాతం రాబడిని స్టాక్ అందించింది. అయితే ప్రస్తుతం రిలయన్స్ పవర్ స్టాక్ ధర ఒక్కోటి మార్కెట్లో రూ.34.57 వద్దకు చేరుకోవటంతో ఇన్వెస్టర్లు భారీగా లాభాలను చవిచూస్తున్నారు. ఇన్నాళ్లుగా ఎదురుచూసిన పెట్టుబడిదారులకు కంపెనీ షేర్లు ఊహించని పెరుగుదలను అందిస్తున్నాయి.
కేవలం ఏడాది కాలంలో రిలయన్స్ పవర్ షేర్లు 90% కంటే ఎక్కువ పెరిగాయి. ఆగస్టు 2, 2023న అనిల్ అంబానీ పవర్ కంపెనీ షేర్లు రూ.18.17 వద్ద ఉండగా.. ప్రస్తుతం అవి మార్కెట్లో ఆగస్ట్ 2, 2024న రూ.34.57కి చేరుకున్నాయి. గత 5 నెలల్లో రిలయన్స్ పవర్ షేర్లు దాదాపు 70% పెరుగుదలను నమోదు చేశాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రిలయన్స్ పవర్ షేర్లు 45% పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 1, 2024న కంపెనీ షేర్లు రూ.23.95 వద్ద ఉన్నాయి.


Click it and Unblock the Notifications