అమెరికాకి వెళ్లి చదువుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలని చాల మంది కళలు కంటుంటారు. అయితే ప్రస్తుతం సిన్ ఒకప్పటిలా లేదు పూర్తిగా మారిపోయింది. ఇందుకు ముఖ్యమైన కారణాలలో ఒకటి అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం. అవును.. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎన్నో విధానాల మార్పలు చేస్తు వస్తున్నారు. ఇవన్నీ మొత్తం ప్రపంచ దేశాలను కదిలించాయి. అలాగే అమెరికాలో ఉంటున్న విదేశీయులను పరుగులు పెట్టించాయి. తాజాగా అమెరికా నుండి భారతీయులను వేల సంఖ్యలో ఇంటికి పంపించేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో రెడ్దిట్లో ఒక వ్యక్తి చేసిన పోస్ట్ అందరిని ఆలోచించేలా చేస్తుంది. అతను చేసిన పోస్టులో, నేను గత 12 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. ఇక్కడికి నేను మొదట ఎంఎస్ డిగ్రీ కోసం వచ్చాను. ప్రస్తుతం USలో ఫుల్ స్టాక్ S/W డెవలపర్‌గా 2 యూనివర్సిటీస్లో 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా స్కిల్స్ పైథాన్, జాంగో (జాంగో RESTతో పాటు), జావాస్క్రిప్ట్, Vue.js, పోస్ట్‌గ్రెస్. నేను వెబ్ అప్లికేషన్లు, డేటా పైప్‌లైన్స్, డేటా విజువలైజేషన్లను కూడా నిర్మించాను. అయితే నా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నాపై ఉండటంతో నేను మే నెలలో ఇండియాకి వచేస్తున్నాను.
గత 6 నెలలుగా నేను ఇండియాలో చాల ఉద్యోగాలకు అప్లయ్ చేశాను కానీ నాకు కేవలం 1 ఇంటర్వ్యూ కాల్ మాత్రమే వచ్చింది అది కూడా చివరి నిమిషంలో రిజక్ట్ అయ్యింది. ఇప్పుడు నేను కెరీర్ సలహాల కోసం చూస్తున్నాను. ఒకవైపు నా తల్లిదండ్రులను ఒంటరిగా వొదిలేయలేను అలాగే నాకు గ్రీన్ కార్డ్ రావడనికి మరో 15+ సంవత్సరాలు ఎదురు చూడాలి కాబట్టి నేను తిరిగి ఇండియాకి రావాల్సిందే. నేను క్లౌడ్ కంప్యూటింగ్ లేదా డాకర్, కుబెర్నెట్స్, మెసేజ్ క్యూలతో ఎప్పుడూ వర్క్ చేయలేదు. దాదాపు ప్రతి జాబ్ పోస్టింగ్‌లో ఈ టెక్నాలజీలు లిస్ట్ చేసి ఉండటం నేను చూసాను. భారతదేశంలోని చాలా మంది డెవలపర్‌లకి ఇప్పటికే ఈ స్కిల్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నాలాంటి సీనియర్ డెవలపర్ ఇప్పటికే తెలుసుకోవలసిన కీలక టెక్నాలజిస్ తెలియకపోవడం నన్ను ఉపయోగం లేకుండా చేసిందని గ్రహించాను.

డేటా ఇంజనీరింగ్‌లో నేను పైథాన్, పాండాలు, డాస్క్, మల్టీప్రాసెసింగ్‌ను ఉపయోగించాను కానీ స్పార్క్ వంటి టూల్స్ ఎప్పుడూ ఉపయోగించలేదు. ఇక్కడ యూనివర్సిటీస్ లేదా రీసర్చ్ టైమ్స్ ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ టూల్స్ కాకూండా అప్ డేట్ కావాలని ఒప్పించడం కష్టం. నా సహోద్యోగులలో ఒకరు తాజాగా కొన్ని ప్రాజెక్టులలో GraphQL ఉపయోగించాలనుకోవడంతో నిరాశతో నిష్క్రమించారు. నిజాయితీగా చెప్పాలంటే నేను DSA తప్ప వేరే ఏది నేర్చుకోవడం పై ఎక్కువ సమయం గడపలేదు అంటూ రెడ్దిట్ ద్వారా వెల్లడించారు. అతను చేసిన పోస్టుకి చాల మంది సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయగా మరికొందరు కొత్తవి నేర్చుకుంటూ ముందుకు సాగాలి అంటూ సలహాలు ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications