ఇది ఇటీవల రెడ్డిట్ లో ఒక భారతీయ ఉద్యోగి పంచుకున్న ఒక కథ. ఆయన చెప్పినట్టే, అమెరికాలోని కంపెనీ భారతీయ ఉద్యోగులలో ఎక్కువ మందిని ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కేవలం 4 నిమిషాల కాల్ ద్వారా ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది.
ఈ ఉద్యోగి US-లోని కంపెనీ కోసం ఇంటి నుంచి పని చేస్తున్నారు. లేఅవ్ జరిగిన రోజు ఆయన ఇలా చెప్పారు "నేను ఉదయం 8:30కి లేచి, 9కి రోజులాగానే లాగిన్ అయ్యాను. ఉదయం 11 కి మా COO నుండి ఒక కాల్-ఇన్వైట్ వచ్చింది. ఇది భారతదేశంలోని అన్ని ఉద్యోగుల కోసం అని చెప్పారు. నేను 11కి జాయిన్ అయ్యాను, ఆయన 11:01 కి వచ్చారు. అందరి కెమెరాలు, మైక్రోఫోన్లు ఆఫ్ చేశారు. తర్వాత సులభంగా ఇలా చెప్పారు "మేము భారత్‌లో ఎక్కువ మంది ఉద్యోగులను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది పని తీరు కారణంగా కాదు కానీ ఇది కేవలం సంస్థలోని అంతర్గత మార్పుల వల్ల మాత్రమే అని చెప్పారు.

COO ఇలా చెప్పారు ఎవరు వదిలివేయబడ్డారో "ఇ-మెయిల్ ద్వారా తెలియజేస్తామని, కానీ ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా" సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. ఉద్యోగి మాకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు, మరియు మాకు ఏ నిర్ణయం ఆలోచించే సమయం ఇవ్వలేదు. అక్టోబర్ నెల జీతం నెల చివరిలో చెల్లించబడుతుంది, ఏదైనా లీవ్ ఉంటే దాన్ని నేరుగా డబ్బుగా ఇస్తాం." కానీ ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధకు ఇవి ఎలాంటి పరిష్కారం ఇవ్వవు. ఇది నా జీవితంలో మొదటి లేఅవ్. నిజంగా చాలా కష్టంగా ఉంది అని తన భాధ ని వ్యక్తపరిచారు.
సోషల్ మీడియాలో చాలా మంది ఆ ఉద్యోగికి మద్దతు ప్రకటించారు. ఒకరు మాట్లాడుతూ, "ఇది వినడం బాధాకరం. మీరు మీడియా రంగంలో ఉన్నారని చూశాను. మీరు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పని చేయడానికి ఆసక్తి ఉంటే, నేను రిఫర్ చేయగలను," అని చెప్పారు. ఉద్యోగి దానికి సమాధానం ఇస్తూ వారి దగ్గర అనుభవం లేకపోయినా ఉద్యోగం ఇస్తే, నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. మరొకరు మాట్లాడుతూ, "ఇది నిజంగా బాధాకరం. నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం లేఅవ్ అయ్యాను, చాలా రోజులు బాధలో ఉన్నాను. ఇది మీ తప్పు కాదు. ప్రతి ఒక్కరూ కనీసం ఒకసారి లేఅవ్ అవుతారు. దీన్ని కొత్త అవకాశం, కొత్త దారిగా చూడండి. మీరు మరింత బలంగా బయటకు వస్తారని నమ్మండి," అని చెప్పారు.
ఇంకొకరు మాట్లాడుతూ "OP, మీరు విలువ లేని ఉద్యోగంలో ఉండకూడదు. త్వరలో మంచి అవకాశం మీకు దొరకాలని ఆశిస్తున్నాను, అని తెలిపారు. "లేఅవ్స్ చాలా కష్టమైనవి. నేను రెండు సార్లు లేఅవ్ అయ్యాను, ఇంకా ఆ జ్ఞాపకాలు మదిలో ఉన్నాయి. ఇలా లేఅవ్ చేయడం చాలా క్రూరం. ఇలాంటి కంపెనీలను నియంత్రించే చట్టాలు ఉండాలి. ఉద్యోగులను రద్దు చేయడం సహజమే, కానీ గౌరవంగా చేయాలి," అని చెప్పారు.
ఒక కంపెనీలో ఉద్యోగులతో ఇలా అకస్మాత్తుగా లేఅవ్ జరిగితే, ఇతర US కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులకీ ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. పని విధానాలను గమనించడం మరియు ఒప్పందం లేదా కంపెనీ విధానాలు గురించి ముందుగా తెలుసుకోవడం మంచిది.
ఈ సంఘటన భారతీయ WFH ఉద్యోగుల భద్రత, కంపెనీ విధానాలు, మరియు ఆన్‌లైన్‌లో మద్దతు వంటి అంశాలను మరోసారి హైలైట్ చేస్తుంది. ఉద్యోగులు, నెట్వర్క్‌లు మరియు సోషల్ మీడియా ద్వారా మద్దతు పొందటం ఎంత ముఖ్యమో ఈ కథనం చూపిస్తుంది.
More From GoodReturns

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్.. సోషల్ మీడియాలో లీకైన భారీ సెవరెన్స్ ప్యాకేజీ వివరాలు!

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్మన్ సాచ్స్

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

Layoffs: లేఆఫ్స్ నుండి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఇదే.. గోల్డ్మన్ సాక్స్ కీలక సూచన!

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

Layoffs: ఒరాకిల్ ఎందుకు ఇన్ని వేల మందిని తీసేస్తోంది? లోపల జరుగుతోంది ఇదే!

LPG: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?



Click it and Unblock the Notifications