అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు నుండి అంటే ఏప్రిల్ 2 నుంచి ఇండియాతో సహా ఇతర దేశాలపై పరస్పర సుంకాల విధిస్తు ప్రకటించిన సంగతి మీకు తెల్సిందే. అయితే ఈ ప్రకనట తరువాత చాలా దేశాలు తీవ్రంగా విమర్శించాయి అంతేకాదు కొన్ని దేశాలు ప్రతిచర్యలు చేపట్టాయి కూడా. మరోవైపు ఈ సుంకాల భయాలు స్టాక్ మార్కెట్ని పట్టి పీడిస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షా భాద్యతలు చేపట్టాక కొన్ని సందర్భాల్లో భారతదేశాన్ని సుంకాల రాజు అని పలికారు. దీని బట్టి చూస్తే ట్రంప్ భారతదేశంపై సుంకాల రూపంలో కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సుంకం అమలు తర్వాత దేశాలతో చర్చలకు మార్గాలు తెరిచి ఉంటాయని కూడా డోనాల్డ్ ట్రంప్ కూడా స్పష్టం చేశారు.

భారతదేశంలో అత్యధిక సుంకాలు: పరస్పర సుంకాల వల్ల భారతదేశంలోని చాల రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని నిపుణులు భావిస్తున్నారు. ET నివేదిక ప్రకారం, VT మార్కెట్స్‌లో గ్లోబల్ స్ట్రాటజీ ఆపరేషన్స్ హెడ్ రాస్ మాక్స్‌వెల్ మాట్లాడుతూ భారతదేశం చారిత్రాత్మకంగా అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలను విధించిందని, అయితే భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా భారతదేశ ఫార్మా, ఆటోమొబైల్, వ్యవసాయం, వస్త్ర పరిశ్రమలు అమెరికా సుంకాల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతాయి.
ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు: FY24లో భారతదేశం నుండి అమెరికాకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు దాదాపు $11.1 బిలియన్లుగా ఉన్నాయి. భారతదేశం అమెరికాకు చేసే మొత్తం ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్ 14% వాటా ఉంది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్లు ఎక్కువ వాటాతో ఉండగా, టారిఫ్‌ల పెరుగుదల ఆపిల్ వంటి కంపెనీలు భారత ఉత్పత్తి వ్యూహాన్ని పునఃపరిశీలించుకోవలసి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు,
రత్నాలు & ఆభరణాలు: రత్నాలు, ఆభరణాల రంగంలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఉంది. ఈ వర్గంలో భారతదేశ మొత్తం ఎగుమతుల విలువ $33 బిలియన్లలో అమెరికా వాటా 30% అంటే $9.9 బిలియన్లు. ఇందులో కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, బంగారు ఆభరణాలు ఇంకా వజ్రాలు ఉన్నాయి. ఈ రంగంపై అమెరికా విధించిన భారీ సుంకాల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని ఎమ్కే గ్లోబల్ చెబుతోంది.
ఫార్మా రంగం: ఫార్మా రంగం గురించి మాట్లాడుకుంటే, భారతదేశం అమెరికాకు 47% జనరిక్ మెడిసిన్స్ సప్లయ్ చేస్తుంది. భారతదేశ జనరిక్ మందులు తక్కువ ధరకు ఉంటాయి, అందువల్ల అమెరికాలో వాటికి మంచి డిమాండ్ ఉంది. కానీ సుంకాలు పెరగడం వల్ల మందులు మరింత ఖరీదైనవి కావచ్చు, ఇది అమెరికా మార్కెట్‌పై భరత్ పట్టును బలహీనపరుస్తుంది. ఫార్మా రంగానికి 10% సుంకం ప్రకటిస్తే, భారతీయ ఫార్మా స్టాక్‌లలో సానుకూల స్పందన కనిపించవచ్చు, కానీ 10% కంటే ఎక్కువ సుంకం నెగటివ్ ప్రభావాన్ని చూపుతుందని గ్లోబల్ బ్రోకరేజ్ ఏజెన్సీ నోమురా పేర్కొంది.
ఆటోమొబైల్ :ఇండియా అమెరికాకు నేరుగా కార్లను ఎగుమతి చేయనప్పటికీ, అమెరికా ఆటో విడిభాగాల మార్కెట్లో మంచి వాటా ఉంది. FY24లో భారతదేశం మొత్తం ఆటో కాంపోనెంట్ ఎగుమతుల్లో అమెరికా వాటా 27%. ఇంజిన్ విడిభాగాలు, ట్రాన్స్‌మిషన్ భాగాలు ఇంకా ఎలక్ట్రికల్ సిస్టమ్‌లతో సహా చాల రకాల ఉత్పత్తులు భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ల వల్ల భారతదేశం ప్రభావితం కావడం సహజం.
వస్త్రాలు: భారతదేశ వస్త్ర, దుస్తుల ఎగుమతుల్లో అమెరికాకు కూడా ప్రధాన వాటా ఉంది. FY24లో భారతదేశ US ఎగుమతులు $9.6 బిలియన్లుగా ఉన్నాయి, ఇది పరిశ్రమ మొత్తం ఎగుమతుల్లో 28% వాటా ఉంది. ఈ రంగం బంగ్లాదేశ్, వియత్నాం నుండి పోటీని ఎదుర్కొంటుందని నిపుణులు అంటున్నారు. సుంకాలు పెరిగితే, భారతీయ ఉత్పత్తులు కాస్ట్లీగా మారతాయి. దింతో బంగ్లాదేశ్ అండ్ వియత్నాం దీని నుండి ప్రయోజనం పొందవచ్చు. పరస్పర సుంకాల అమలు ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఎంకే గ్లోబల్ చెబుతోంది


Click it and Unblock the Notifications