డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్న చర్యల వల్ల ప్రపంచ దేశాలు కూడా అమెరికా వైపు చూసేలా చేసాయి. ఎన్నికల హామీలు, గోల్డ్ వీసా, ప్రతీకార సుంకాలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ట్రంప్ తీసుకొస్తున్న మార్పులు ఇప్పుడు ఇండియాతో సహా ఇతర దేశలను వణికిస్తున్నాయి. ఈ తరుణంలోనే డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను ప్రకటిస్తూ భారతదేశంతో సహా మొత్తం ప్రపంచానికి పెద్ద షాక్ ఇచ్చారు. ట్రంప్ ఇండియా పై 26% 'పరస్పర సుంకం' విధించగా, చైనా పై 34%, యూరోపియన్ యూనియన్ పై 20%, జపాన్ పై 24% సుంకాలు విధించారు. అయితే ఈ కొత్త టారిఫ్ ప్లాన్ ప్రకటన వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భాన్ని "విముక్తి దినోత్సవం" అని కూడా పలికారు. విధించిన సుంకాలు పూర్తిగా ప్రతీకార చర్య కాదని, పాక్షికంలాంటివేనని ట్రంప్ అన్నారు.

ఈ ప్రకటన సందర్భంగా ఆయన భారతదేశం, చైనా, UK అండ్ యూరోపియన్ యూనియన్ సహా వివిధ దేశాలపై విధించిన సుంకాలను చూపించే చార్ట్‌ను ప్రదర్శించారు. దీనితో పాటు, ఈ దేశాలు ఎదుర్కోవాల్సిన కొత్త ప్రతీకార సుంకాలను కూడా చూపించారు. ఈ చార్ట్ భారతదేశ సుంకాలలో 52% చూపిస్తుంది. ఇందులో "కరెన్సీ ఎక్స్చేంజ్ అండ్ వాణిజ్య అడ్డంకులు" కూడా ఉన్నాయని ట్రంప్ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా ఇప్పుడు 26% 'రాయితీ ప్రతీకార సుంకం' విధిస్తుంది.
అయితే ట్రంప్ ఈ సుంకాల గురించి వివరంగా వివరించారు. దీని పై మాట్లాడుతూ, 'భారతదేశం చాలా కష్టతరమైన దేశం. ప్రధానమంత్రి మోడీ నాకు మంచి స్నేహితుడు, కానీ అమెరికాతో సరిగ్గా ప్రవర్తించడం లేదని ఆయన చెప్పారు. అమెరికాపై భారతదేశం 52% సుంకాన్ని వసూలు చేస్తుంది. అమెరికా సంవత్సరాలుగా భారతదేశం నుండి దాదాపు ఎం వసూలు చేయలేదని ఆయన అన్నారు.
ఆటొమొబైల్ సుంకాలలోని తేడాని కూడా ట్రంప్ ఎత్తి చూపారు. ఇతర దేశాల వాహనాలపై అమెరికా 2.4% సుంకం మాత్రమే విధిస్తుందని అన్నారు. కానీ థాయిలాండ్ సహా ఇతర దేశాలు 60%తో చాలా ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నాయి. భారతదేశం 70%, వియత్నాం 75% వసూలు చేస్తుంది అండ్ ఇతర దేశాలు ఇంకా ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నాయి.
బాధను వ్యక్తం చేసిన ట్రంప్: డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఇప్పటివరకు అమెరికా దశాబ్దాలుగా విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 2.5% సుంకాన్ని విధించిందని అన్నారు. EU మాత్రం 10% కంటే ఎక్కువ సుంకం వసూలు చేస్తుంది, వీరికి 20% VAT ఉంది, ఇది చాలా ఎక్కువ. భారతదేశం 70% సుంకాన్ని వసూలు చేస్తుంది. అనవసరమైన విషయం ఏమిటంటే దక్షిణ కొరియా, జపాన్ సహా చాల ఇతర దేశాలు నాన్ మానిటరీ సాంక్షన్స్ విధిస్తున్నాయి. ఈ భారీ వాణిజ్య అడ్డంకుల కారణంగా ఈ పరిమితులు విధించబడ్డాయి.


Click it and Unblock the Notifications