గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత ఎంతో మందిని నిరుద్యోగులుగా మార్చేసింది. అంతకంటే ముందు కరోనా కారణంగా కూడా ఉద్యోగుల తోలగింపులు జరిగాయి. ఉద్యోగాల కోత విధించిన కంపెనీలలో ప్రముఖ టెక్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగాల కోత మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, Amazon.com Inc. కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుండి డజన్ల కొద్దీ ఉద్యోగులను తొలగించింది. ఖర్చులు, బ్యూరోక్రసీ తగ్గింపు పై పని చేస్తున్న తరుణంలో ఈ చర్య వచ్చింది. మెటా అండ్ మైక్రోసాఫ్ట్ తర్వాత అమెజాన్ 2025లో ఉద్యోగాలను తొలగించిన మూడవ టెక్ దిగ్గజం.
తాజాగా రివ్యూ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ప్రతినిధి బ్రాడ్ గ్లాసర్ ఒక ఇమెయిల్ ద్వారా తెలిపారు. " మేము వేగంగా మూవ్ అవడానికి, ఓనర్షిప్ పెంచుకోవడానికి, మా సంస్కృతిని బలోపేతం చేయడానికి ఇంకా కస్టమర్లకి మా టీమ్‌ను మరింత చేరువ చేయడంలో సహాయపడటానికి కమ్యూనికేషన్స్ అండ్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్‌లో కొన్ని మార్పులు చేస్తున్నాము" అని
బ్రాడ్ గ్లాసర్ చెప్పారు. ఈ మార్పులలో భాగంగా, కంపెనీ తక్కువ సంఖ్యలో ఉద్యోగాలను తొలగించిందని కూడా చెప్పారు. " మేము ఈ నిర్ణయాలను తేలికగా తీసుకోము అలాగే ప్రభావితమైన ఉద్యోగులకు సపోర్ట్ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము." అని అన్నారు.

ఈ నెల ప్రారంభంలో అమెజాన్ నార్త్ అమెరికా స్టోర్స్ విభాగంలోని కొంతమంది ఉద్యోగులను తొలగించింది, ఈ తొలగింపు దేశవ్యాప్తంగా ఉన్న 200 మంది ఉద్యోగులపై ప్రభావం చూపింది. 2023లో కూడా అమెజాన్ 27 వేల మంది ఉద్యోగులను రెండు రౌండ్లలో తొలగించింది. అదేవిధంగా ఏప్రిల్ 2024లో కంపెనీ వందలాది ఉద్యోగాల కోత విధించింది. కరోనా మహమ్మారి తరువాత, గత సంవత్సరం అమెజాన్ కార్పొరేట్ ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీసుకి రావాలని ఆదేశాన్ని ప్రకటించింది. దింతో చాలా మంది సిబ్బంది బలవంతంగా రాజీనామా చేసే చర్యగా భావించారు.
ఈ నెల ప్రారంభంలో మార్క్ జుకర్‌బర్గ్ మెటా ఐదు శాతం ఉద్యోగాల కోత ప్రకటించింది. ఇంటర్నల్ మెమోలో కంపెనీ CEO తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న ఉద్యోగులను వేగంగా తొలగించాలని కంపెనీ నిర్ణయం గురించి తెలియజేశారు. Metaలో 72,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు నివేదించింది. నివేదిక ఆధారంగా తాజా ప్రకటనతో Meta వర్క్‌ఫోర్స్‌లో 3,600 ఉద్యోగాలు తగ్గుతాయి. మరో అమెరికన్ ఇ-కామర్స్ కంపెనీ వేఫెయిర్ ఈ నెలలో జర్మనీ నుండి నిష్క్రమించాలని అలాగే 730 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications