దేశీయంగా ఈ-కామర్స్ వ్యాపారం నిర్వహిస్తున్న కంపెనీల నష్టాలు ఇంకా భారీ స్థాయిలోనే నమోదు అవుతున్నాయి. అమెజాన్ కు చెందిన అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ 2018-19 ఆర్ధిక సంవత్సరానికి 5,685 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది. అయితే ఈ నష్టం గత ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 9.5 శాతం తక్కువ. క్రితం ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ 6,287.9 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసుకుంది. బిజినెస్ ఇంటెలీజెన్స్ ప్లాట్ ఫామ్ టొఫ్లర్ సంపాదించినా పత్రాల ద్వారా ఈ వివరాలు వెలుగు చూశాయి.
రాబడుల్లో జోరు వృద్ధి
* 2018-19 ఆర్ధిక సంవత్సరంలో అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ రాబడి 55 శాతం వృద్ధి చెంది 7,778 కోట్ల రూపాయలకు చేరుకుంది. దేశంలోని తన ఇతర కంపెనీలను కూడా కలిపితే 2018-19 ఆర్ధిక సంవత్సరంలో అమెజాన్ నష్టాలు 7000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. అమెజాన్ హోల్ సేల్ ఇండియా రాబడి గత ఆర్ధిక సంవత్సరంలో 8 శాతం వృద్ధి చెంది 11,250 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇదే కాలంలో ఈ సంస్థ నష్టం 131.4 కోట్ల రూపాయల నుంచి 141 కోట్ల రూపాయలకు పెరిగింది.

* అమెజాన్ పే ఇండియా నష్టాలు 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 1,160.8 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో దీని నష్టాలు 334 కోట్ల రూపాయల స్థాయిలో ఉన్నాయని టొఫ్లర్ పేర్కొంది. ఇదే కాలంలో రాబడులు మాత్రం రెండితలకు పైగా పెరిగి 834 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
* అమెజాన్ ట్రాన్స్ పోర్టేషన్ సర్వీసెస్ రాబడులు 31 శాతం పెరిగి 2,079 కోట్ల రూపాయలకు చేరుకోగా నేతలు 27.5 కోట్లకు చేరాయి. కాగా ఈ వివరాలను అమెజాన్ ఇండియా ద్రువీకరించాల్సి ఉంది.
ఫ్లిప్ కార్ట్ నష్టం రూ.3,837 కోట్లు
* వాల్ మార్ట్ కు చెందిన ఫ్లిప్ కార్ట్ ఇండియా 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను 3,836.8 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసుకుంది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరం (రూ.2,063.8 కోట్లు) తో పోల్చితే నష్టాలు పెరిగాయి. కంపెనీ కార్పొరేట్ మంత్రిత్వ శాఖ కు సమర్పించిన సమాచారంలో ఈ వివరాలు ఉన్నాయి. నష్టం 85.91 శాతం పెరిగింది. కంపెనీ రాబడిలో మాత్రం మంచి వృద్ధి నమోదయింది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ రాబడి 42.82 శాతం పెరిగి 30,931 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో రాబడి 21,657.7 కోట్లుగా ఉంది.
* ఫ్లిప్ కార్ట్ ఇండియా బిజినెస్ తో బిజినెస్ ప్రాతిపదికన మొబైల్, టీవీలు, లాప్ టాప్, టాబ్లెట్, మొబైల్ యాక్సెసరీస్, పాదరక్షలు, దుస్తులు వంటి హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం నిర్వహిస్తోంది. గత ఏడాది ఆగస్టు నెలలో ఫ్లిప్ కార్ట్స్ హోల్డింగ్ కంపెనీలో అమెరికాకు చెందిన వాల్ మార్ట్ మెజారిటీ వాటాను తీసుకున్న విషయం తెలిసిందే.
* మరోవైపు ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ నష్టాలు కూడా పెరిగిపోయాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి దీని నష్టాలు 40 శాతం పెరిగిపోయి 1,624 కోట్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో దీని నిర్వహణ రాబడులు 51 శాతం పెరిగి 4,234 కోట్లకు చేరుకున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications