Amazon Great Indian Festival Sale: అక్టోబర్ 4 నుండి ఆఫర్స్, డిస్కౌంట్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సేల్ 2021 తేదీలను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 4వ తేదీన ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ కంటే మూడు రోజుల ముందే ప్రారంభమవుతోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో తేదీలను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ సేల్ అక్టోబర్ 7వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. కానీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సేల్ మాత్రం నాలుగో తేదీన ప్రారంభమై, ఆ నెల అంతా ఉంటుంది. ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్, పెరిపెరల్స్, ఆడియో గూడ్స్, టెలివిజెన్స్, అప్లియెన్సెస్ తదితర వాటిపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. డిస్కౌంట్స్‌తో పాటు గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సేల్ 1000 కొత్త ప్రోడక్ట్స్‌ను లాంచ్ చేస్తోంది. ఆపిల్, ఆసుస్, ఫోసిల్, హెచ్‌పీ, వన్ ప్లస్, శాంసంగ్, సోనీ, షియోమీ కొత్త లాంచింగ్స్ చేస్తోంది.
అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్స్, డిస్‍ప్లేస్, ఫైర్ టీవీ గాడ్జెట్స్, కిండిల్ ఈ బుక్ రీడర్స్ వంటి వాటి పైన డిస్కౌంట్ ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సేల్ సందర్భంగా అమెజాన్ సోనీ ప్లే స్టేషన్ 5, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ సిస్టమ్స్‌ను లాంచ్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు ముందుగానే గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సేల్ అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఏడాది కాస్త ముందుగానే అందుబాటులో ఉంటుంది.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సేల్ సందర్భంగా HDFC బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే పది శాతం తక్షణ డిస్కౌంట్ ఉంటుంది. ఈ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ పేను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు రూ.5వేల వరకు ఆదా చేయవచ్చు. ఈ ఈవెంట్ సందర్భంగా ఎనర్జీ బిల్స్, పర్చేజ్ టిక్కెట్స్, సెండ్ మనీ ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు.


Click it and Unblock the Notifications