వాషింగ్టన్: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ లాభాలను నమోదు చేసింది. అమెరికా చరిత్రలోనే ఒక్కరోజు వ్యవధిలో అత్యధిక మార్కెట్ విలువను సంపాదించుకున్న సంస్థగా అమెజాన్ రికార్డు నెలకొల్పింది. త్రైమాసిక ఫలితాలు మదుపర్లను మెప్పించడంతో కంపెనీ షేర్లు శుక్రవారం 13.5 శాతం మేర లాభపడ్డాయి. దీంతో అమెజాన్ మార్కెట్ విలువ ఒకే రోజులో 190 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 14.18 లక్షల కోట్లు) ఎగబాకి 1.6 ట్రిలియన్ డాలర్కు చేరింది.
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ఒకరోజు వ్యవధిలో అత్యధిక విలువను కోల్పోయి రికార్డు సృష్టించిన మరుసటి రోజే అమెజాన్ భారీ లాభాలను నమోదు చేసి చరిత్ర సృష్టించడం విశేషం. కాగా, అమెజాన్ తాజాగా టెస్లా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. జనవరి 28న వెలువడిన త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో టెస్లా షేర్లు ఆ రోజు భారీగా ర్యాలీ అయ్యాయి.
ఒక్క రోజులో 181 బిలియన్ డాలర్ల అదనపు మార్కెట్ విలువను కంపెనీ సొంతం చేసుకుంది. తాజాగా, ఈ రికార్డును అమెజాన్ 190 బిలియన్ డాలర్లతో అధిగమించింది. త్రైమాసిక ఫలితాలు మెప్పించడం, అమెరికాలో ప్రైమ్ సభ్యత్వం ధరలను పెంచనున్నట్లు ప్రకటించడమే అమెజాన్ షేర్ల ర్యాలీకి కారణంగా తెలుస్తోంది. ఈ ర్యాలీని రిటైల్ మదుపర్లు లాభాల స్వీకరణకు వినియోగించుకున్నట్లు ఫిడెలిటీ వెబ్‌సైట్ వివరాల ద్వారా వెల్లడైంది.
కొనుగోలు ఆర్డర్ల కంటే అమ్మకం ఆర్డర్లే శుక్రవారం ఎక్కువగా కనిపించినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. కాగా, అమెజాన్ ఒక్కరోజులో పోగేసుకున్న సంపద ఏటీఅండ్ టీ, మోర్గాన్ స్టాన్లీ, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ కంపెనీల మార్కెట్ విలువతో సమానం కావడం గమనార్హం.

రెఫినెటివ్ ప్రకారం... ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ యజమాని ఆల్ఫాబెట్.. వాల్ స్ట్రీట్ అత్యంత విలువైన కంపెనీలుగా ఉన్నాయి. వరుసగా మార్కెట్ క్యాపిటలైజేషన్ $2.8 ట్రిలియన్ (దాదాపు రూ. 2,09,00000 కోట్లు), $2.3 ట్రిలియన్ (దాదాపు రూ. 1,71,67800 కోట్లు), $1.9 ట్రిలియన్ (దాదాపు రూ. 1,41,82100 కోట్లు).
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications