ఇప్పటి వరకూ ఆధార్-పాన్ లింక్ చేయనివారికి చివరి ఆలర్ట్. Income Tax Deportment వెల్లడించిన లింక్ డెడ్‌లైన్ మే 31 సాయంత్రం.. అంటే ఈ రోజుతో ముగుస్తుంది. నిజానికి, ఆధార్-పాన్ లింక్ ఉచితంగా చేసేందుకు ఇచ్చిన అవకాశం గతంలోనే ముగియడంతో రూ. 1000 జరిమానాతో ఐటీ శాఖ మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. ఇప్పుడు ఆ గడువుకు కూడా మే 31 డెడ్‌లైన్ కావడంలో పన్ను చెల్లింపుదార్లకు చివరి అలర్ట్‌గా ప్రకటించింది. ఈ రెండింటినీ జత చేయకపోతే, పన్ను చెల్లింపుదారులనుంచి సాధారణం కంటే రెట్టింపు పన్నులు వసూలు చేస్తుంది. మే 31 సాయంత్రంలోగా ఈ పని పూర్తి చేసే పన్ను చెల్లింపుదారుల నుంచి 2024 మార్చి 31 వరకు నిర్వహించిన లావాదేవీలపై రెట్టింపు TDS లేదా TCS వసూలు చేసే అవకాశం ఉండదు. లేకపోతే డబుల్ టాక్స్ కట్ అవుతుంది. ఆ మొత్తాన్ని ఐటీఆర్ క్లయిమ్ చేసే సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్-పాన్ లింక్ ప్రక్రియ ఇలా!
ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ లోకి వెళ్లాలి. అప్పటికే, వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోనట్లయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ, యూజర్ ఐడీగా మీ పాన్ నంబర్‌ను ఇవ్వాలి.
తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'లింక్ ఆధార్'పై క్లిక్ చేస్తే.. పుట్టిన తేదీ, జెండర్ వివరాలను నమోదు చేయాలి. మిగిలిన వివరాలను ఆధార్‌తో సరిపోల్చుకుని, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. పెనాల్టీగా రూ. 1,000 చెల్లించడం ద్వారా పాన్ - ఆధార్‌ను లింక్ చేయవచ్చు. అలా లింక్ అయిన వెంటనే మీ మొబైల్ నంబర్‌కు, ఈ-మెయిల్ ఐడీకి మెసేజ్ వస్తుంది.

పాన్-ఆధార్ లింక్ స్టేటస్‌ను ఎలా చూడాలి?
పాన్-ఆధార్ లింక్ స్థితిని ఆదాయ పన్ను విభాగం అధికారిక పోర్టల్ www.incometax.gov.in/iec/foportal/ లో సైన్ ఇన్ చేయకుండానే చేక్ చేసుకోవచ్చు. ముందుగా ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీలో, 'Quick Links' విభాగంలోకి వెళ్లి, 'లింక్ ఆధార్ స్టేటస్' క్లిక్ చేయాల్సి ఉంటుంది. పాన్, ఆధార్ నంబర్లను సంబంధిత గడుల్లో నమోదు చేసి, 'View Linked Aadhaar Statusస పై క్లిక్ చేయాలి. వెంటనే పాన్-ఆధార్ లింక్ అయిందో, లేదో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications