ఇండియా టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ ప్రముఖ మొబైల్ మేకర్ నోకియాతో రూ.1 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది. మన కరెన్సీలో దాదాపు రూ.7,636 కోట్లు. ఎయిర్‌టెల్ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు నోకియా వెల్లడించింది. ఈ డీల్ ద్వారా దేశంలో కస్టమర్లకు నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు 5G సేవల్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తొమ్మిది సర్కిళ్లలో మరింత మెరుగైన నెట్ వర్క్
ఈ డీల్‌లో భాగంగా కంపెనీ దేశవ్యాప్తంగా తొమ్మిది సర్కిళ్లలో 4G నెట్ వర్క్‌ను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన రేడియో యూనియ్లను ఏర్పాటు చేస్తుంది. దీంతో నెట్ వర్క్ కెపాసిటీ మెరుగవుతుంది. కస్టమర్లకు కూడా మెరుగైన సేవలు అందుతాయి. 2022 నాటికి భారత్‌లో 3 లక్షల మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ కంపెనీలు కలిసి పని చేయనున్నాయి.

కంపెనీలు ఏం చెప్పాయి
పై సర్కిళ్లలో సింగిల్ రేడియో యాక్సెస్ నెట్ వర్క్ సొల్యూషన్స్ కోసం నోకియాతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారతీ ఎయిర్ టెల్ తెలిపింది. అతిపెద్ద టెలికాం మార్కెట్లలో కనెక్టివిటీ భవిష్యత్తుకు ఇది కీలక ఒప్పందమని, ఈ ఒప్పందం ఇండియాలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని నోకియా సీజీవో రాజీవ్ సూరి అన్నారు. ఇండియాలో ఆన్ లైన్ డిమాండ్ పెరుగుతోందని, అలాగే మొబైల్ వినియోగదారుల సంఖ్య 92 కోట్లకు చేరుకుంటుందన్నారు.

ఇది పునాది
మున్ముందు 5G కనెక్టివిటీకి తాజా డీల్ పునాది అవుతుందని, పలు స్పెక్ట్రం బ్యాండ్స్‌లో దాదాపు 3,00,000 రేడియో యూనిట్స్ ఏర్పాటు చేస్తామని, 900 Mhz, 1800 Mhz, 2100 Mhz, 2300 Mhz బ్యాండ్స్ 2022 నాటికి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 5G నెట్ వర్క్ ప్రారంభమైనప్పుడు ఎయిర్‌టెల్‌కు ఉత్తమమైన వేదిక అవుతుందని తెలిపింది.

5G నెట్ వర్క్‌కు మొగ్గు
ప్రపంచంలో ఇండియా రెండో అతిపెద్ద టెలికం మార్కెట్. 2025 నాటికి 920 మిలియన్ల యూనిక్ మొబైల్ కస్టమర్లు ఉంటారని అంచనా. ఇందులో 88 మిలియన్ల మంది 5G కనెక్షన్ కలిగి ఉంటారు. 2019లో డేటా ట్రాఫిక్ 47 శాతం పెరిగింది. ఇక ముందు కూడా భారీగా పెరుగుతుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications