ఢిల్లీ: వినియోగదారులకు టెలికం సంస్థలు షాకిచ్చాయి. 2016లో జియో ఎంట్రీ తర్వాత అన్ని వాయిస్ కాల్స్, డేటా ఛార్జీల ధరలు చాలా తగ్గుముఖం పట్టాయి. వినియోగదారుడు ఏమాత్రం భారంగా ఫీల్ కానంతగా మారిపోయింది. ఇప్పుడు చౌకధరల మొబైల్ సేవలకు టెలికం సంస్థలు స్వస్తి పలుకుతున్నాయి. ప్రీపెయిడ్ కస్టమర్లకు కాల్, డేటా టారిఫ్ పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ ప్రకటన చేశాయి. 3వ తేదీ నుంచి అంటే సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయి. రిలయన్స్ జియో 6వ తేదీ నుంచి టారిఫ్ పెంచుతుంది.
వినియోగదారులకు టెలికం కంపెనీల షాక్: పెంచిన ఛార్జీలు ఇలా...

పెరుగుదల 47 శాతం వరకు.. నిమిషానికి 6 పైసలు
గత నాలుగైదు ఏళ్లలో తొలిసారిగా ప్రీపెయిడ్ కస్టమర్లకు వాయిస్ కాల్, డేటా ఛార్జీలు పెరుగుతున్నాయి. ఛార్జీల పెరుగుదల కనీసం 47 శాతం వరకు ఉంది. కనీసం 15 శాతం నుంచి ఈ పెంపు చోటు చేసుకుంటోంది. ఇతర నెట్ వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేస్తాయి. సర్దుబాటు స్థూల ఆదాయం (AGR) విషయంలో ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించిన సుప్రీం కోర్టు స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్ ఫీజు చెల్లింపుల బకాయిలు, వడ్డీలతో సహా చెల్లించాలని తీర్పు చెప్పింది. తమ మనుగడ కోసం ధరల పెంపు మార్గంగా కనిపిస్తోందని సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి.

రూ.49 రీచార్జ్ చేయిస్తేనే ఇన్‌కమింగ్
నెలకు రూ.49తో రీఛార్జ్ చేయిస్తేనే కస్టమర్లు ఇన్‌కమింగ్ కాల్స్ రిసీవ్ చేసుకుంటారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత కస్టమర్లు నెలకు కనీసం రూ.49 రీఛార్జ్ చేయవలసి ఉంటుందని వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ ప్రకటించాయి.

జియో దారిలో... ఉచిత కాల్స్‌కు చెల్లుచీటీ
మూడేళ్ల క్రితం జియో రాకతో ఉచిత అపరిమిత కాల్స్ తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఇవి కనుమరుగు అవుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ తమ ప్లాన్లలో తెచ్చిన మార్పులు అపరిమిత ఉచిత కాల్స్‌కు చెక్ పెడుతున్నాయి. ఇతర నెట్‌వర్క్ యూజర్లకు చేసే ప్రతీ కాల్‌పై నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని ప్రకటించాయి. ఇప్పటికే జియో ఈ చార్జీలను వసూలు చేస్తోంది.

టాపప్ వేసుకోవాలి
కస్టమర్లు ఆయా ప్లాన్లలో ఉన్న పరిమిత కాల్ వ్యవధి లేదా టాక్ టైం దాటితే ఇతర నెట్‌వర్క్స్‌కు ఫోన్ చేయాలంటే టాపప్ కార్డులు వేసుకోవాలి. అయితే సొంత నెట్‌వర్క్ కస్టమర్ల మధ్య ఉచిత కాలింగ్ సదుపాయాన్ని కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications