యూరోపియన్ ప్లేన్ మేకర్ ఎయిర్‌బస్ కరోనా మహమ్మారి వైరస్ నేపథ్యంలో తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలను తొలగిస్తేనే కంపెనీ నిలదొక్కుకుంటుందని అభిప్రాయపడింది. ఈ కంపెనీలో 1,35,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వెంటనే చర్యలు చేపట్టకుంటే కంపెనీకి కష్టమేనని గత శుక్రవారం ఉద్యోగులకు తెలిపింది. ఈ చర్యల్లో ఉద్యోగాల కోత కూడా ఉండవచ్చునని తెలిపింది.

ఉద్యోగులకు లేఖ
ఈ మేరకు ఎయిర్ బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గులామ్ ఫారీ ఉద్యోగులకు లేఖ రాశారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఇటవల మూడొంతుల కంటేఎక్కువ ఉత్పత్తిని తగ్గించింది. ఉత్పత్తి క్రమంగా పూర్తిగా పడిపోతోంది. డిమాండ్ పూర్తిగా పడిపోతున్న నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడంపై అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఉద్యోగాలు తొలగించకుంటే మనుగడే ప్రశ్నార్థకం
ఎయిర్ బస్ ఇప్పటికే వేతనం లేని సెలవులు ఇస్తోంది. ఫ్రాన్స్‌లో 3,000 ఉద్యోగులకు ఇలా ఇవ్వడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి సారించింది. ఇది మాత్రమే సరిపోదని, మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోని పక్షంలో ఎయిర్ బస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశముందన్నారు.

ఉద్యోగాల కోత.. ప్రభుత్వాలతో చర్చలు
ఈ వేసవి కాలంలో 10,000 ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే డిమాండ్ ఆధారంగా ఏం చేయాలనే అంశాలపై అన్వేషిస్తోంది ఎయిర్ బస్. అయితే గట్టెక్కేందుకు ఇప్పటికే యూరోపియన్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది ఎయిర్ బస్.

వారాల్లోనే మూడోంతులు డౌన్
ప్రపంచ విమానయానికి డిమాండ్ తగ్గడంతో తాము ఉత్పత్తి చేసే విమానాల సంఖ్యను మూడొంతులు తగ్గిస్తున్నట్లు గత వారం ప్రకటించింది. రెండు మూడు వారాల్లోనే తమ వ్యాపారంలో మూడింట ఒక వంతు నష్టపోయామని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాకపోవచ్చునని చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నారు.

తగ్గిన ఉత్పత్తి
సాధారణంగా ప్రతి నెల 60 మోస్ట్ పాపులర్ ఎయిర్ బస్ ఏ320 మోడల్స్ ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు వాటిని 40కి తగ్గించింది. A330 రెండుకు, A350sను ఆరుకు తగ్గిస్తోంది. ఈ సంస్థకు యూకేలో 13,500 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో చాలామంది బ్రాటన్, నార్త్ వేల్స్, ఫిల్టన్, బ్రిస్టల్‌లో వింగ్స్ తయారీకు సహకరిస్తారు. ఎయిర్ బస్ బుధవారం క్వార్టర్ ఫలితాలను విడుదల చేయనుంది. ఆ సమయంలో ఉద్యోగాల కోత ప్రకటించవచ్చు.


Click it and Unblock the Notifications