Airbus: ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల కోతల విలయం కొనసాగుతుంటే భారత్ లో మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించటం లేదు. పైగా చాలా కంపెనీలు కొత్తగా ఉద్యోగులను భారీ స్థాయిలో నియమించుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ కంపెనీ ఇండియాలో వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించింది.

ఏరోస్పేస్ కంపెనీ..
యూరప్ కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ తమ కంపెనీలు ఇంజనీరింగ్, ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించింది. ఈ నెలలో బెంగళూరులో జరగనున్న 'ఏరో ఇండియా'లో ఇది జరగనుంది. అయితే కంపెనీ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మెుత్తం 13,000 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత నిపుణులు సైతం ప్రయోజనం పొందనున్నారు.

అందుకే నియామకాలు..
డీకార్బనైజేషన్ రోడ్‌మ్యాప్, విమానయాన భవిష్యత్తు కోసం సన్నాహాల్లో కొత్త నియామకాలు కీలకంగా ఉంటాయని గ్లోబల్ ఏరోస్పేస్ సంస్థ ఎయిర్ బస్ వెల్లడించింది. ఆసియాలోనే అతిపెద్ద ఏరోస్పేస్ ఎగ్జిబిషన్‌గా పేరొందిన "ఏరో ఇండియా " 14వ ఎడిషన్ ఫిబ్రవరి 13- 17 వరకు బెంగళూరు కేంద్రంగా జరగనుంది.

కెరీర్ అవకాశాలు..
ఔత్సాహిక అభ్యర్థులు హాల్ సిలోని స్టాండ్ నంబర్ CR7.1 వద్ద ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్‌లను కలుసుకోవచ్చు. అక్కడ వారు ఎయిర్‌ఫ్రేమ్ డిజైన్, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ సిమ్యులేషన్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ క్యాబిన్ ఇంజనీరింగ్‌లో కెరీర్ అవకాశాలను అన్వేషించవచ్చని కంపెనీ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఏరోస్పేస్ పట్ల మక్కువ కలిగిన అత్యుత్తమ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ ప్రతిభకు ఎయిర్‌బస్ అత్యుత్తమ గమ్యస్థానంగా ఉందని ఎయిర్‌బస్ ఇండియా, దక్షిణాసియా హెచ్‌ఆర్ డైరెక్టర్ సూరజ్ చెత్రీ అన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications