న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించడానికి ముందుకు రావట్లేదు. వాయు మార్గాలను మూసివేశాయి. జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కెనడా వంటి పలు దేశాలు భారత్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి.

డీజీసీఏ బ్యాన్ పొడిగింపు..
అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించే విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టంగా ఉంది. దేశం సరిహద్దులను దాటుకుని వెళ్లే కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను ఈ నెల చివరి వరకూ పొడిగించింది. ఈ మేరకు కిందటి నెల 30వ తేదీన ఓ ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు కమర్షియల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసినట్టయింది. భారత విమాన ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్‌ను కొనసాగిస్తోనన దేశాలు సానుకూలంగా స్పందించకపోవడం వల్లే డీజీసీఏ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కొనసాగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

లండన్‌కు ఫ్లైట్స్ రీస్టార్ట్
ఈ పరిస్థితుల మధ్య దేశీయ విమాన ప్రయాణికులకు ఎయిరిండియా అద్దిరిపోయే శుభవార్తను వినిపించింది. ఎప్పుడెప్పుడా అంటూ విమాన సర్వీసుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోన్న వారికి గుడ్‌న్యూస్ ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ వరకు విమాన సర్వీసులను నిషేధించినప్పటికీ.. రద్దీ మార్గాల్లో విమాన సర్వీసులను పునరుద్ధరిస్తోంది ఎయిరిండియా. ఇందులో భాగంగా కేరళలోని కోచి నుంచి లండన్‌కు విమాన విమానాలను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

22 నుంచి.. వారంలో మూడు రోజులు
కోచి-లండన్ మార్గంలో ఈ నెల 22వ తేదీ నుంచి విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రాబోతోన్నట్లు ఎయిరిండియా పేర్కొంది. వారంలో మూడు రోజుల పాటు విమానాలు నడుస్తాయని తెలిపింది. యూరప్ దేశాలకు కనెక్టివిటీని పెంచాలనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆది, బుధ, శుక్ర వారాల్లో లండన్‌లోని హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోచికి తమ విమానాలు రాకపోకలు సాగిస్తాయని ఎయిరిండియా తెలిపింది.

ప్రస్తుతం ఒకటే
ప్రస్తుతం కోచి-లండన్ మధ్య వారానికి ఒక విమాన సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉంటోంది. నంబర్ ఏఐ 150/149 విమానం ఈ నెల 18వ తేదీన లండన్‌లోని హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుంది. మళ్లీ అదే విమానం ఈ నెల 22వ తేదీన లండన్‌కు బయలుదేరి వెళ్తుంది. అప్పటి నుంచి వారంలో మూడు రోజులు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కొచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ సుభాష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

షెడ్యూల్ ఇలా..
ప్రతి రోజూ తెల్లవారు జామున 3 గంటలకు ఎయిరిండియా విమానం కోచి నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1:20 నిమిషాలకు లండన్‌కు చేరుకుంటుందని తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న కరోనా వైర్స నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు మూడు కరోనా వైరస్ నెగెటివ్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. తొలి నెగెటివ్ టెస్ట్.. విమానం ఎక్కడానికి మూడు రోజుల ముందు నిర్ధారణ చేయించుకుని ఉండాలి. రెండో నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్‌ను విమానాశ్రయానికి చేరిన తరువాత అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

10 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి..
మూడో టెస్ట్ విమానం దిగిన ఎనిమిదో రోజు చేయించుకోవాల్సి ఉంటుంది. బ్రిటన్ చేరిన తరువాత 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. రెండు డోసుల వ్యాక్సిన్లను తీసుకున్న బ్రిటీష్ పౌరులకు కరోనా వైరస్ మూడో నిర్ధారణ పరీక్షల నుంచి మినహాయింపు ఇచ్చిందక్కడి ప్రభుత్వం. విమానం దిగిన ఎనిమిదో రోజు వారు ఆ మూడో టెస్ట్‌ను అందజేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాగే అమెరికా లేదా యూరోపియన్ కంట్రీల్లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి 10 రోజుల హోమ్ క్వారంటైన్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది.

అమెరికా ఏం చేస్తుందో..
కాగా ఇదివరకే ముంబై-లండన్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్‌ను నడిపిస్తామని ఎయిరిండియా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విమాన సర్వీసులు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. ఇక తాజాగా కొచ్చి నుంచి కూడా ఫ్లైట్స్ అందుబాటులోకి రావడం వల్ల లండన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటోన్నారు. మొత్తం 13 డైరెక్ట్ ఫ్లైట్స్ నడిపిస్తుంది ఎయిరిండియా. ఇక అమెరికాకు విమాన సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది తెలియాల్సి ఉంది. మే 6వ తేదీన అమెరికా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఈ ట్రావెల్ బ్యాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యలో భారత్ కోసం అమెరికా కొత్త ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.

కరోనా తీవ్రత తగ్గడంతో ఎయిరిండియా రీస్టార్ట్ అవుతుందా?
దేశంలో కరోనా వైరస్ తీవ్రత బాగా తగ్గింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య నియంత్రణలోనే ఉంటోంది. ఈ సంఖ్య 30,000 నుంచి 40,000 మధ్యే నమోదవుతోంది. మరణాల సంఖ్య కూడా ఇదివరకట్లా దడ పుట్టించట్లేదు. ఆగస్టు చివరివారంలో థర్డ్‌వేవ్ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 38,667 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 35,743 మంది డిశ్చార్జ్ అయ్యారు. నమోదయ్యాయి. వీక్లీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంటోంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications