IT రిటర్న్స్ ఫైలింగ్ గడువు పొడిగింపు.. నిర్మలమ్మ రెస్పాన్స్ కోసం వెయిటింగ్
IT Returns: ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్ కు గడువు రేపటితో ముగియనుంది. గతంలో మాదిరిగా ఈసారి గడువు పెంచే యోచన లేనట్లు IT విభాగం ఇటీవల స్పష్టం చేసింది. కానీ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవగా.. ఈ ప్రక్రియకు కొంత విఘాతం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో గడువు పెంపుపై క్లారిటీ కోసం వేతనజీవులు ఎదురుచూస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ గడువును మరో నెలపాటు పొడిగించాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ కోరింది. ఈ మేరకు పన్ను చెల్లింపుదారులకు ఆగస్టు 31, 2023 వరకు ఉపశమనం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అభ్యర్థించింది.

వివిధ రాష్ట్రాల్లో వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు కారణంగా కనెక్టివిటీ దెబ్బతిని రిటర్న్స్ ఫైలింగ్ కు ఇబ్బంది ఎదురైనట్లు ఆర్థిక మంత్రికి AIFTP నివేదించింది. ఇందుకు తోడు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్(AIS), 26AS డేటా కొంత ఆలస్యంగా పోర్టల్ లో అసెస్సీలకు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకుని మరోనెల పాటు ఫైన్ లేకుండా ఫైలింగ్ కు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.
ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్(AIFTP) ఓ అతిపెద్ద వృత్తిపరమైన సంస్థ. ప్రజలకు పన్ను విధానం పట్ల అవగాహన పెంపొందిస్తూ, ఈ రంగంలో కెరీర్ అవకాశాలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. వివిధ ప్రాంతాలకు చెందిన 11 వేల మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ ఇందులో సభ్యులు. 46 ఏళ్లుగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరి AIFTP రిక్వెస్ట్ పై ఫైనాన్స్ మినిస్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..


Click it and Unblock the Notifications