AI దెబ్బకు భారత్‌లో 2030 నాటికి కోటి 80 లక్షలు ఉద్యోగాలు గల్లంతు.. షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి..

దూసుకొస్తున్న AI వలన ఉద్యోగాల్లో ఊహించని భూకంపం చోటుచేసుకోబోతోంది. 2030 నాటికి తయారీ, రిటైల్, విద్య రంగాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని...ఏకంగా కోట్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టబోతోందని సరికొత్త రిపోర్టు బయటకు వచ్చింది. విజ్ఞానశాస్త్రం, సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి యుగంలో, కృత్రిమ మేధ (Artificial Intelligence) భారతదేశంలోని ఉద్యోగ రంగాలను గణనీయంగా మార్చబోతోందని ఈ సర్వే తేల్చి చెప్పింది.

తాజాగా వెలువడిన సర్వీస్‌నౌ నివేదిక ప్రకారం.. 2030 నాటికి తయారీ, రిటైల్, మరియు విద్య రంగాల్లో దాదాపు 1.8 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని తేల్చింది. ఏఐ ప్రధానంగా తయారీ రంగంపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఈ రంగంలో సుమారుగా 80 లక్షల మంది ఉద్యోగులు అనేక ఒడిదుడుకులకు లోనవుతారని సర్వే తెలిపింది. అలాగే రిటైల్ రంగంలో 76 లక్షల ఉద్యోగాలు డేంజర్ జోన్ లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇక విద్యా రంగంలో 25 లక్షల ఉద్యోగాలు AI వలన ప్రమాదంలోకి జారుకుంటాయని నివేదిక తెలిపింది.

AI job impact in India artificial intelligence and employment AI in manufacturing sector AI in retail sector AI in education sector AI job loss India 2030 AI automation jobs India future of jobs in India AI artificial intelligence job trends AI affecting Indian workforce AI-driven automation impact AI and Indian economy AI job disruption 2030 emerging technologies India jobs India AI employment forecast AI AI AI AI AI 2030 AI AI AI

AI వృద్ధి అమిత వేగంగా పయనిస్తుండటంతో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అత్యధిక ఆటోమేషన్‌కు లోనయ్యే ఉద్యోగాలైన నిర్వాహకులు, పేరోల్ క్లర్క్స్ వంటి పాత్రలు ప్రమాదంలో పడనున్నాయి. అదే సమయంలో కన్సల్టెంట్లు, సిస్టమ్ అడ్మిన్‌లు వంటి హై-గ్రోత్ ఉద్యోగాలు AIతో కలిసి పనిచేసే కొత్త విధానాలకు ఆజ్యం పోసే అవకాశం ఉంది.

తాజాగా చూసుకున్నట్లయితే దేశంలో టాప్ ఐటీ దిగ్గజం టీసీఎస్ 12 వేల ఉద్యోగాలను ఏఐ రాకతో తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం శ్రామికశక్తిలో సుమారు 2 శాతానికి సమానమని తెలిపింది. ఈ నేపథ్యంలో.. కృత్రిమ మేధ భవిష్యత్‌లో మరెన్ని ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు పెరిగిపోతున్నాయి.

సర్వీస్‌నౌ ఇండియా టెక్నాలజీ & బిజినెస్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ మాట్లాడుతూ..ఏఐ వల్ల 1.35 కోట్ల మంది ఉద్యోగుల పాత్రలు మారిపోతాయని చెప్పుకొచ్చారు. సంక్షోభంలో కూడా కొత్త అవకాశాలు తలుపుతడతాయని తెలిపారు. AI వల్ల 2030 నాటికి 30 లక్షల కొత్త టెక్ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని తెలిపారు. AI స్వీకరణపై 500 మందికి పైగా పరిశ్రమ నాయ‌కులపై జరిపిన సర్వేలో.. టెక్ బడ్జెట్లలో ఇప్పటికే 13.5 శాతం ఖర్చులు AI పై కేంద్రీకృతమయ్యాయని వెల్లడైంది. నాలుగో వంతు సంస్థలు ఇప్పటికే డిజిటల్ మార్పు దశలో ఉన్నాయి.

ఈ మార్పులకు ప్రధాన అడ్డంకిగా డేటా భద్రత ఉన్నట్లు సర్వేలో వెల్లడయింది. ఇక డేటా సెక్యూరిటీ విషయంలో 30 శాతం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. 26 శాతం సంస్థలు భవిష్యత్తులో అవసరమయ్యే నైపుణ్యాలపై స్పష్టత లేదన్నాయి. ఈ సర్వే దేశానికి వ్యూహాత్మక దూరదృష్టితో కూడిన స్కిల్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవసరం ఉందని చెబుతోంది. మొత్తానికి ఏఐ ఓవైపు ఉద్యోగాలకు ఎసరు పెడుతూ మరోవైపు కొత్త ఉద్యోగాలకు తలుపులు తెరుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+