AI ఉద్యోగాలు: టీసీఎస్ ఛైర్మన్ షాకింగ్ వార్నింగ్! మీ భవిష్యత్తు ఏంటి?

ఇప్పుడు ఐటీ ప్రపంచంలో ఎటు చూసినా ఒకే మాట వినిపిస్తోంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). AI వాడకం పెరిగాక చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే, ఇండియాలో టాప్ ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఓ షాకింగ్ విషయం చెప్పారు. రాబోయే 3 ఏళ్లలో ఉద్యోగులకు సమానంగా AI ఏజెంట్లను వాడతామని చెప్పి సంచలనం సృష్టించారు.

AI టెక్నాలజీ వల్ల ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయి. కానీ ఇండియాలో AI అన్ని ఉద్యోగాలను తీసేయదు. అయితే, అంతకంటే పెద్ద ప్రమాదమే పొంచి ఉంది.

ఏళ్లుగా ఇండియాలోని మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలకు చెప్పేది ఒకటే మాట. "బాగా చదువుకుని, ఓ డిగ్రీ సంపాదించి, ఐటీ జాబ్ లో చేరిపో.. లైఫ్ సెటిల్ అయిపోతుంది" అని. కానీ ఇప్పుడు AI మెల్లమెల్లగా ఈ కలను చెరిపేస్తోంది. AI రాకతో ఏకంగా ఒక తరం భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారేలా ఉంది.

టీసీఎస్ ఛైర్మన్ చెప్పినట్టుగా AI ఏజెంట్ల వాడకం పెరిగితే, ఈసారి రిక్రూట్‌మెంట్ తక్కువగా ఉంటుందని స్పష్టమవుతోంది. దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది ఎంట్రీ లెవల్ ఉద్యోగులే. జూనియర్ అనలిస్ట్, కోడర్, టెస్టర్, ప్రాసెస్ వర్కర్, డాక్యుమెంటేషన్ టీమ్ వంటి విభాగాల్లో పనిచేసే ఫ్రెషర్లకు ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ఉంది. ఇది కేవలం టీసీఎస్‌కు మాత్రమే పరిమితం కాదు. మిగతా కంపెనీలు కూడా AI వాడకాన్ని పెంచితే ఇదే పరిస్థితి ఎదురవుతుంది.

AI జాబ్ మార్కెట్‌ను మూడు భాగాలుగా విభజించనుంది. మొదటి కేటగిరీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని బాగా ఉపయోగించడం తెలిసిన ఉద్యోగులు, సీనియర్ మేనేజర్లు ఉంటారు. వీరికి వరుసగా ఇంక్రిమెంట్లు లభించి, అధిక జీతాలతో పనిచేస్తారు.

ఇక రెండో కేటగిరీలో, చదువుకుని ఉద్యోగం దొరకని కొందరు స్విగ్గీ, జొమాటో వంటి సర్వీస్ రంగంలోని పనుల్లోకి వెళ్లిపోతారు. ఎందుకంటే ఈ పనులను ఎప్పటికీ ఒక సాఫ్ట్‌వేర్‌తో చేయలేరు. కాబట్టి ఈ ఉద్యోగాలు అలాగే ఉంటాయి. ఒకవేళ ఇలాంటి పనులను రోబోలతో చేయించాలన్నా దానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇలాంటి పనులకు శారీరక శ్రమ ఎక్కువ, జీతం తక్కువగా ఉంటుంది.

మూడో కేటగిరీ వారికే అసలు సమస్య ఎదురవుతుంది. సాధారణ కాలేజీల్లో చదివి, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారే ఎక్కువగా నష్టపోతారు. కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి పనులను మనుషుల కంటే AI చాలా కచ్చితత్వంతో చేసేస్తుంది. దీంతో కంపెనీలు ఈ పనులకు కొత్తవారిని తీసుకోవడం తగ్గించేశాయి. దీనివల్ల పెద్ద కాలేజీల్లో చదవని, యావరేజ్‌గా చదివిన కోట్లాది మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.

ఇటీవల 'మెర్సర్స్ ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ 2025' పేరుతో ఒక రిపోర్ట్ విడుదలైంది. దాని ప్రకారం, ఇండియాలో డిగ్రీ పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో కేవలం 42.60 శాతం మందికి మాత్రమే వారు కోరుకున్న కంపెనీల్లో చేరేంత నైపుణ్యం ఉంది. మిగిలిన 57 శాతం మంది విద్యార్థుల దగ్గర డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ, ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ లేవని తేలింది.

AI

ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగే, మంచి నెట్‌వర్క్ ఉన్న విద్యార్థులకు AI ఒక సూపర్ ఆయుధంగా మారుతుంది. ఇలాంటి వాళ్లు కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్తారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండి, సరైన గైడెన్స్ లేని విద్యార్థుల పరిస్థితే ఆందోళన కలిగిస్తోంది. వీళ్లు సాధారణంగా కంపెనీల్లో కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి ఉద్యోగాల్లో చేరి తమ కెరీర్‌ను ప్రారంభించేవారు. కానీ ఇప్పుడు AI ఈ ఉద్యోగాలను కూడా లాగేసుకుంటుండటంతో, ఇలాంటి మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తే అగమ్యగోచరంగా మారనుంది.

AI ఒకవైపు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నా.. మరోవైపు కొన్ని ఉద్యోగాలను కచ్చితంగా తగ్గించబోతోంది. కాబట్టి, విద్యార్థులు దానికి అనుగుణంగా తమ స్కిల్ సెట్‌ను మెరుగుపరుచుకుంటేనే ఈ పోటీలో నిలబడగలరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+