AI ఉద్యోగాలు లాగేస్తుందా? ఇండియా ఆఫీస్ రియల్ ఎస్టేట్ షాకింగ్ నిజం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోతామని భయపడుతున్నారు. కానీ, ఇండియా ఆఫీస్ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం దీనికి పూర్తి భిన్నమైన అంచనాలను వెల్లడిస్తోంది.
సాధారణంగా, ఉద్యోగులను ఎక్కువగా తీసేస్తే ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ తగ్గుతుంది, ఆఫీసులు ఖాళీ అవుతాయి. కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు ఇలాగే ఆఫీసులు ఖాళీ అవ్వడం మనం చూశాం.
అయితే, ఏఐ వచ్చినా, ఉద్యోగాల కోతలు పెరిగినా... ఇండియాలో ఆఫీసులకు వచ్చి పనిచేసే ఉద్యోగుల సంఖ్య రాబోయే 4 ఏళ్లలో 3.8 కోట్ల నుంచి 4.8 కోట్లకు పెరుగుతుందని కుష్‌మ్యాన్ & వేక్ఫీల్డ్ సంస్థ నివేదిక చెబుతోంది.

ఇండియాలో ఆఫీస్ ఆధారిత వ్యాపారాలు, సేవలు ఒకవైపు పెరుగుతుండగా, మరోవైపు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) కంపెనీల రాక వేగంగా పెరుగుతోంది. దీనివల్ల ఇండియాలో ఆఫీసులకు డిమాండ్ కచ్చితంగా పెరుగుతుంది. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేట్ అయినా, హై-ఎండ్ సేవలు అందించే కంపెనీల సంఖ్య పెరుగుతుంది. అందుకే ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ తగ్గదని కుష్‌మ్యాన్ & వేక్ఫీల్డ్ నివేదిక స్పష్టం చేసింది.
భారతదేశంలో ఆఫీస్ రియల్ ఎస్టేట్ వృద్ధికి జీసీసీ కంపెనీలే కీలక ఆధారం కానున్నాయి. దీనికి తోడు, ప్రస్తుతం ఇండియాలో R&D, ప్రొడక్ట్ ఇంజినీరింగ్, అనలిటిక్స్ వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో పెద్ద నగరాల్లో ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ మరింత పెరగనుంది.
ఐటీ, టెక్, డిజిటల్ సర్వీసుల కంపెనీలు ఇప్పుడు టైర్-2, టైర్-3 నగరాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఈ కారణంగా, చిన్న నగరాల్లో కూడా ఆఫీస్ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మారింది.
సాధారణంగా, ఒక నగరం అభివృద్ధిలో ఆఫీస్, ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రెండూ వృద్ధి చెందితే, రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి.


Click it and Unblock the Notifications