IT News: ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ ఇచ్చిన టెక్ కంపెనీ.. ఆశ్చర్యంలో ఉద్యోగులు..
IT News: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎలా తయారైందంటే కనీసం ఫోన్ వచ్చినా సరే భయపడుతున్నారు. ఈ రోజు ఆఫీసుకు రానిచ్చారు హమ్మయ్యా అనుకుంటున్నారు టెక్కీలు. వారి ఆశల మేడలు ఎప్పుడు కూలిపోతాయో తెలియక ఆందోళనలో రోజులు గడుపుతున్నారు.

టెక్ దిగ్గజాలకు భిన్నంగా..
మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు ఉన్న ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ సమయంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా అందించి వార్తల్లో నిలిచింది. ఒకపక్క విదేశీ కంపెనీలు ఉద్యోగాలు పీకేస్తూ వారిని ఆందోళనల్లోకి నెడుతుంటే భారతీయ టెక్ కంపెనీ మాత్రం బహుమతులతో ఉద్యోగులను ముంచెత్తింది.

ఎందుకు బహుమతులు..
అహ్మదాబాద్ కు చెందిన త్రిధ్య టెక్ అనే ఐటీ కంపెనీ ఉద్యోగులకు కార్లను బహుమతిగా అందించటంతో వార్తల్లో నిలిచింది. కంపెనీ ప్రారంభించి ఇటీవలే 5 ఏళ్లు పూర్తైంది. ఈ క్రమంలో కంపెనీ పురోగతికి సహాయపడిన ఉద్యోగులకు కంపెనీ 13 ఖరీదైన కార్లను బహుమతిగా అందించింది. ఈ క్రమంలో మాట్లాడిన ఎండీ రమేశ్ మరాంద్ కంపెనీ గత ఐదేళ్లుగా ఏది సాధించినా అది ఉద్యోగుల కృషి ఫలితమేనని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులోనూ..
కంపెనీ తన ఉద్యోగులకు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్‌లను అందించడం కొనసాగిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు సిబ్బందిని వ్యాపారం కోసం కష్టపడి పనిచేయడానికి మరియు నిమగ్నమై ఉండటానికి ప్రోత్సహిస్తాయని మరాండ్ అన్నారు. కంపెనీ చొరవకు ఉద్యోగుల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన వెల్లడించారు.

చెన్నై కంపెనీ..
ఏప్రిల్ 2022లో చెన్నైకి చెందిన IT కంపెనీ Ideas2IT సైతం తన ఉద్యోగులకు బహుమతులు అందించింది. 10 ఏళ్లకు పైగా కంపెనీలో పనిచేసిన 100 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా అందించింది. ఇదే క్రమంలో చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ (సాస్) కంపెనీ 5 సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఖరీదైన BMW కార్లను బహుమతిగా అందించింది.


Click it and Unblock the Notifications