భారతదేశం రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోందని రష్యా బహిరంగంగా ప్రకటించింది. అయితే ఆ ఒత్తిడి భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపదని, రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను నిలబెట్టుకుంటాయని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. మంగళవారం, డిసెంబర్ 02, 2025న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పెస్కోవ్ మాట్లాడుతూ .. చమురు విక్రయించే మా హక్కును, కొనుగోలు చేయాలనుకునే దేశాల హక్కును రక్షించడానికి మేము అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాము. మా చమురును కొనుగోలు చేసే దేశాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి రష్యా కట్టుబడి ఉందని తెలిపారు. అదేవిధంగా, భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రష్యా గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు.భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడడంలో ఎంతో స్వతంత్రత కలిగిన దేశం. ఆ నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నామని చెప్పారు.

అమెరికా ఒత్తిడికి తలొగ్గేలా భారత్ సెప్టెంబర్ నుండి రష్యన్ ముడి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించడం ప్రారంభించింది. ఆగస్టులో ట్రంప్ పరిపాలన 25 శాతం అదనపు సుంకం విధించడం వల్ల మొత్తం సుంకం 50 శాతానికి పెరిగింది.దీని ప్రభావంతో భారతదేశం సెప్టెంబర్‌లో రష్యా నుండి 17 శాతం తక్కువ దిగుమతులు చేసింది.డిసెంబర్‌లో ఈ దిగుమతులు రోజుకు 600,000-650,000 బ్యారెళ్లకు పడిపోయే అవకాశం ఉంది. గతంలో 1.8 మిలియన్ బ్యారెళ్ల (bpd)గా ఉండగా ఈ సారి అది భారీగా తగ్గే అవకాశం ఉంది.
అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ ఆంక్షలను ఉల్లంఘించకుండా ఉండేందుకు భారత్‌లోని రిఫైనరీ సంస్థలు ప్రత్యామ్నాయ వనరులు వెతుకుతున్నాయి. రష్యాపై విధించిన తాజా ఆంక్షలే రష్యన్ చమురుకు పెద్ద సమస్యగా విదేశీ ఎనర్జీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ తగ్గుదల ఉన్నప్పటికీ, భారత్ ఇప్పటికీ రష్యా చమురును ప్రపంచంలో రెండవ అతిపెద్దగా కొనుగోలు చేసే దేశం. అక్టోబర్‌లో రూ.22,170 కోట్ల విలువైన ముడి చమురు భారత్‌కు చేరింది. చైనా రూ. 32,820 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.
ఇదిలాఉంటే.. Russia అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం భారత్ సందర్శించనున్నారు. ఈ పర్యటనలో వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, శాస్త్రీయ పరిశోధన, సాంస్కృతిక సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అమెరికా అయితే రష్యా ఎనర్జీ కొనుగోళ్లను తగ్గించాలన్న ఒత్తిడిని చేస్తూనే ఉంది. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై కొత్త శిక్షా చట్టం రూపకల్పనపై వాషింగ్టన్ ఆలోచిస్తోంది. అయినప్పటికీ, పెస్కోవ్ వాఖ్యల తర్వాత రష్యా-భారత్-అమెరికా త్రిభుజ సంబంధాలు ఎలా మారతాయన్నది అంతర్జాతీయంగా ఆసక్తిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ ఢిల్లీకి రానున్నారు, ఇది రెండు దేశాల భవిష్యత్ వ్యూహాత్మక నిర్మాణాన్ని నిర్ణయించే ముఖ్య క్షణంగా నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications