2024 నాటికి మన దేశ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఇక్కడి అవకాశాలను మరింతగా అందిపుచ్చుకునేందుకు
డ్రాగన్ కంట్రీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం మన దేశంలో అమ్ముడవుతోన్న ప్రతి పది ఫోన్లలో ఏడు చైనా కంపెనీలవే. ఈ విషయం ఇటీవల కౌంటర్ పాయింట్ తాజా అధ్యయనంలో కూడా వెల్లడైంది.
మన దేశంలోని మొబైల్ మార్కెట్‌లో మెజారిటీ వాటాను తన హస్తగతం చేసుకున్న చైనా తాజాగా మన ఆటోమొబైల్ రంగంపైనా దృష్టిసారించింది. ఈ రంగంలో కూడా మెజారిటీ వాటాను సొంతం చేసుకునే దిశగా డ్రాగన్ కంట్రీ పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన 'ఆటో ఎక్స్‌పో 2020'ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

టాప్ ఆటో కంపెనీల చూపులన్నీ...
చైనాలో ఆటోమొబైల్ రంగంలోని పెద్ద కంపెనీలన్నీ ఇప్పుడు మన ఆటోమొబైల్ మార్కెట్‌ను చేజిక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. మొబైల్స్ రంగంలో మాదిరిగానే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో కూడిన కార్లను మన దేశ ఆటోమొబైల్ రంగంలోకి తీసుకొస్తూ తమ మార్కెట్ షేరును క్రమంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు, ఎలక్ట్రిక్ వాహనాలను అమ్ముతోన్న చైనా ఆటోమొబైల్ దిగ్గజాలు ఎంజీ మోటార్స్, గ్రేట్‌వాల్ వంటి కంపెనీలు భారత్‌లో పాతుకుపోవడానికి ఏకంగా తయారీ ప్లాంట్‌లనే ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి...
ఒకవైపు అమ్మకాలు సరిగా లేక భారత ఆటోమొబైల్ రంగంలోని పెద్ద కంపెనీలు సైతం కుదేలవుతుంటే.. చైనాకు చెందిన ఆటో కంపెనీలు మాత్రం ఇక్కడి మార్కెట్‌పై గట్టి ఆశలు పెట్టుకుంటున్నాయి. 2026 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అవుతుందని, అలాగే 2023 నాటికే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ కూడా రెండు బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందనే అంచనాల నేపథ్యంలో.. పలు చైనా ఆటో మేకర్స్ భారత ఆటోమొబైల్ రంగంలో తమకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఎంజీ మోటార్స్ ఏం చేస్తోందంటే....
‘హెక్టర్' పేరుతో ఎస్‌యూవీలను, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోన్న చైనా ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటార్స్ ఇండియాలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఈ కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఎస్‌యూవీ ‘హెక్టర్'కి ఇప్పటికే 20 వేల ఆర్డర్లు ఉన్నాయంటే.. ఈ వాహనానికి ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారు కోసం వినియోగదారులు నెలల తరబడి ఎదురు చూస్తుండడం విశేషం. దీంతో ఎంజీ మోటార్స్ జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా లాంచ్ చేసింది. స్థానిక కంపెనీలతో కలసి చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తోంది.

బరిలోకి దిగిన ‘గ్రేట్‌వాల్’...
చైనాకు చెందిన మరో ఆటోమొబైల్ దిగ్గజం ‘గ్రేట్‌వాల్' కూడా భారత ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు రంగంలోకి దిగింది. జనరల్ మోటర్స్ భారత్ నుంచి నిష్క్రమించిన తరువాత మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న ఆ కంపెనీ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను చైనా కంపెనీ ‘గ్రేట్‌వాల్' కొనేసింది. వచ్చే ఏడాది జూన్‌లోపే ఈ ప్లాంటును ప్రారంభించేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది.

తయారీ రంగంలోకి మరిన్ని కంపెనీలు...
ఎంజీ మోటార్స్, గ్రేట్‌వాల్ దారిలోనే చైనాకు చెందిన మరికొన్ని ఆటోమొబైల్ కంపెనీలు కూడా నడవనున్నాయి. సన్‌రా అనే ఆటో మొబైల్ కంపెనీ భారత్‌లో ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీకి ఆసక్తి చూపుతోంది. త్వరలో భారత మార్కెట్‌లోకి ఆరు ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేయనున్న ఈ కంపెనీ వచ్చే ఐదేళ్లలో తయారీ యూనిట్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది. ఇక చంగన్ అనే కంపెనీ సైతం భారత్‌లో తయారీకి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ కంపెనీ ఇప్పటికే కొంతమంది సరఫరాదారులతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. భారత్‌లో కూడా ఈవీ బ్యాటరీ అసెంబ్లీ ప్లాంట్లను ఏర్పాటుకు సంబంధించిన ప్రపోజల్స్‌ను ఈ కంపెనీ ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications