Smart Phone Price Hike: స్మార్ట్ ఫోన్ల ధరలు పెంచిన శామ్‌సంగ్, షావోమి.. మిగతా బ్రాండ్లు కూడా పెరిగే అవకాశం..!
దీపావళి పండుగ సీజన్ ముగిసిన వారం రోజుల్లోపే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన శామ్‌సంగ్ (Samsung), షావోమి (Xiaomi) ఇండియాలో తమ సంస్థకు చెందిన పలు రకాల స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. శామ్‌సంగ్ తన గెలాక్సీ ఎఫ్ (Galaxy F), A (Galaxy A) సిరీస్‌లకు చెందిన పలు మోడళ్ల ధరలను రూ. 2,000 వరకు పెంచింది. ఇది 3.13 శాతం నుంచి 9.52 శాతం వరకు పెరుగుదలను సూచిస్తుంది. ఈ కంపెనీకి చెందిన మొత్తం 22 వేరియంట్లలో సగటున 5.36 శాతం ధర పెరిగింది. అలాగే షావోమి కూడా తన రెడ్‌మి (Redmi), రెడ్‌మి నోట్ (Redmi Note) సిరీస్‌లలోని పలు మోడళ్ల ధరలను పెంచింది.
వీటిలో రెడ్‌మి A7, రెడ్‌మి 15C, రెడ్‌మి 17, రెడ్‌మి నోట్ 17, నోట్ 17 ప్రో, నోట్ 17 ప్రో మాక్స్ వంటి మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు 4.26 శాతం నుంచి 18.75 శాతం వరకు పెరిగాయి. మొత్తం 19 వేరియంట్లలో సగటున 10.02 శాతం ధర పెరుగుదల నమోదైంది. ఫోన్ రకాన్ని బట్టి ఒక్కో ఫోన్ పై రూ.1000 నుంచి రూ.4000 పెరిగింది. ే2025 మధ్యకాలం నుంచి డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ (DRAM), ఫ్లాష్ స్టోరేజ్ చిప్‌సెట్‌ల తీవ్ర కొరత కారణంగా. వీటి విడిభాగాల ధరలు ఏకంగా 300 శాతం వరకు పెరిగాయి. ఇది స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లను తమ వ్యూహాన్ని పునరాలోచించుకునేలా చేసింది. ఇందులో ధరను పెంచి ఆ భారాన్ని వినియోగదారులపై మోపడం కోసం ధరలు పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అంతే కాకుండా కంపెనీలు స్మార్ట్ ఫోన్ తయారీ ఖర్చును తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. పాత చిప్‌సెట్‌లను ఉపయోగించడం, ప్రీమియం భాగాలను (కెమెరాలోని టెలిఫోటో లెన్స్) తొలగించడం, OLED స్థానంలో LCD ప్యానెల్‌లను అమర్చడం వంటి ఖర్చు తగ్గింపు చర్యలు చేపడుతున్నాయి. రీఫర్బిష్డ్ ఫోన్‌లను అమ్మడం, కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లను నిలిపివేయడం వంటివి ఉన్నాయి. గత 18 నెలల్లో, స్మార్ట్‌ఫోన్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పలుమార్లు పెంచారు. నేటికీ అనిశ్చితి నెలకొని ఉంది. మెమరీ కొరత కనీసం 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బహుశా 2029 లేదా 2030 వరకు కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతే మొబైల్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. రాబోయే వారాల్లో ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా తమ స్మార్ట్‌ఫోన్ ధరలను మళ్లీ పెంచే అవకాశం ఉంది. మెమరీ, విడిభాగాల ధరలు పెరుగుతుండటంతో ఒప్పో (Oppo), వివో (Vivo), రియల్‌మీ (Realme) వంటి ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. ధరల పెంపు ఎంట్రీ-లెవల్, మిడ్-రేంజ్ విభాగాల్లో వినియోగదారులకు ధరల భారాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications