పన్నా-ముక్తా చమురు క్షేత్రాలలోని వాటాను రిలయన్స్, షెల్ ఇండియా.. ఓఎన్జీసీకి బదలీ చేస్తున్నాయి. రిలయన్స్ ఇండియా(RIL), షెల్ ఇండియా నేతృత్వంలోని BG ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ ఇండియా లిమిటెడ్ (BGEPIL) రేపు (21 డిసెంబర్ 2019) పన్నా-ముక్తా ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్‌లోని మొత్తం వాటాను ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ONGC)కు బదలీ చేయనున్నాయి. RIL, BGEPIL, ONGC కలిసి ఈ చమురు క్షేత్రాన్ని గత 25 సంవత్సరాలుగా ఆపరేట్ చేస్తున్నాయి.
పన్నా-ముక్తా అండ్ తాప్తి (PMT) జాయింట్ వెంచర్‌లో ONGC వాటా 40 శాతం కాగా, RIL, BGEPILలలో ఒక్కో దానికి 30 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. BG ఎక్స్‌ప్లోరేషన్.. షెల్ ఇండియా అనుబంధ సంస్థ.

1994లో కుదిరిన ఈ ఒప్పందం 21 డిసెంబర్ 2019తో ముగుస్తోందని, తాప్తి క్షేత్రాలు 2016లో ఉత్పత్తిని నిలిపివేశాయని తాప్తి ప్రాసెస్ ప్లాట్ ఫాం ఫెసిలిటీస్‌ను 2016లో ఓఎన్జీసీకి అప్పగించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
PMT జాయింట్ వెంచర్ ప్రస్తుతం ఐదు మానవరహిత ప్లాట్ ఫామ్స్, ఇన్ ఫీల్డ్ పైప్ లైన్స్‌తో సహా రెసిడ్యూవల్ తాప్తి ఫెసిలిటీస్ తొలగింపు, సైట్ పునరుద్ధరణను నిర్వహిస్తున్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. పన్నా ముక్తా ఫీల్డ్స్ చమురు క్షేత్రాలను అప్పగించిన అనంతరం కూడా BG ఎక్స్‌ప్లోరేషన్‌లో తాప్తి డికామిషనింగ్, ఇతర వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపింది.
2007-08 ఏడాదిలో పన్నా ముక్తా దేశీయ ఆయిల్ ప్రొడక్షన్‌లో 6 శాతం, గ్యాస్ ప్రొడక్షన్‌లో 7 శఆతం ఉత్పత్తి చేసింది. ఇది గరిష్టం. ఈ ప్రయాణంలో రిలయన్స్ కూడా భాగస్వామ్యమైందని, తద్వారా భారత చమురు, గ్యాస్ రంగ అభివృద్ధికి తనవంతుగా తోడ్పడిందని ఆర్ఐఎల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ ప్రెసిడెంట్ బీ గంగూలీ అన్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications