భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత జీడీపీ వృద్ధి రేటు 11 శాతంగా ఉండవచ్చునని, ఎకానమీ రికవరీకి సెకండ్ వేవ్ ఆందోళనగా ఉందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ADB) ఔట్ లుక్ బుధవారం పేర్కొంది. సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన రికవరీకి ఆందోళనకరంగా మారిందని పేర్కొంది. మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం ఎకానమీ వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా అమలు కావడం, వచ్చే కొద్ది నెలల్లో ఈ కార్యక్రమం మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టడం సానుకూల అంశం.

ఆర్థిక అంచనా
2021లో ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7 శాతం పెరుగుతుందని ఏడీబీ అంచనా వేసింది. అదే సమయంలో సౌత్ ఏషియా జీడీపీ 9.5 శాతంగా ఉండవచ్చునని పేర్కొంది. 2022లో 6.6 శాతానికి తగ్గవచ్చునని తెలిపింది. ఈ క్యాలెండర్ ఏడాదిలో సౌత్ ఏషియా వృద్ధి 7.3 శాతంగా అంచనా వేసింది. గత ఏడాది ఇది మైనస్ 0.2 శాతంగా అంచనా వేసింది. సెంట్రల్ ఏషియా, ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, పసిఫిక్ ప్రాంతాల్లోని 46 సభ్యులు కలిగిన దేశాలు ఏడీబీ జాబితాలో ఉన్నాయి.

చైనా ఎగుమతులు అదుర్స్
చైనా నుండి ఎగుమతులు చాలా పటిష్టంగా ఉన్నాయి. హౌస్ హోల్డ్స్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. 2021లో చైనా ఎకానమీ 8.1 శాతం వృద్ధిని నమోదు చేసుకోవచ్చునని వెల్లడించింది. 2022లో ఇది 5.5 శాతానికి తగ్గవచ్చునని పేర్కొంది. ఆసియా వృద్ధి ధోరణి మెరుగుపడుతున్నప్పటికీ సెకండ్ వేవ్ రికవరీకి ఇబ్బందికరంగా మారిందని తెలిపింది.

ప్రభుత్వ వ్యయాలు
మౌలికరంగంలో పెట్టుబడులు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, గ్రామీణ ఆదాయాలకు చేయూత వంటి కార్యక్రమాల ద్వారా భారత్‌లో ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నాయని తెలిపింది. వ్యాక్సినేషన్ వేగవంతంగా ఉందని, దేశీయ డిమాండ్ మెరుగ్గానే ఉందని పేర్కొంది. వివిధ అంశాలు ఆర్థికరంగాన్ని పట్టాలు తప్పనీయకపోవచ్చునని పేర్కొంది. వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ అయి, తద్వారా సెకండ్‌వేవ్ కట్టడి ప్రాతిపదికగా ఈ ఔట్ లుక్ ఉన్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications