For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ambani-Adani Game: అంబానీ-అదానీ సీక్రెట్ డీల్.. ఆ విషయంలో ఒకరిజోలుకు మరొకరు వెళ్లరంట..!

|

Ambani-Adani Game: భారత వ్యాపార రంగంలో శరవేగంగా ఎదుగుతున్న ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల కంపెనీలు కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ముందుకుపోతున్నాయి. గత మూడేళ్లుగా ఇద్దరు వ్యాపారవేత్తలు అనేక రంగాల్లో ముఖాముఖి పోటీ పడుతున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం వీరు ఒకరి జోలుకు మరొకరు వెళ్లొద్దని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఐటీ కంపెనీలు చేసిన తప్పు..

ఐటీ కంపెనీలు చేసిన తప్పు..

ఇటీవల ఐటీ రంగంలో టెక్ ఉద్యోగుల డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీగా ఉద్యోగులను రిక్రూట్‌మెంట్ చేసుకోవడం చూస్తున్నాం. ఈ క్రమంలో వారికి అధిక జీతాలను ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. వీటివల్ల టాప్-4 ఐటీ కంపెనీలు కోలుకోలేకపోతున్నాయి. ఆ ప్రభావం కంపెనీల మార్జిన్లపై తీవ్రంగా పడుతోంది.

 ముఖేష్ అంబానీ - గౌతమ్ అదానీ..

ముఖేష్ అంబానీ - గౌతమ్ అదానీ..

కొన్నేళ్ల క్రితం వరకు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ వేర్వేరు వ్యాపార మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. కానీ వాణిజ్యాన్ని విస్తరించే అనేక రంగాల్లో రెండు దిగ్గజాలు కొన్ని రంగాల్లో ముఖాముఖి పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ ఇతర కంపెనీల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేయకూడదని నో-పోచింగ్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం రెండు సమ్మేళనాల్లోని అన్ని వ్యాపారాలకు వర్తిస్తుంది. ప్రస్తుతం ఇది అమలులో ఉంది.

పెట్రోలియం వ్యాపారంలోకి..

పెట్రోలియం వ్యాపారంలోకి..

రిలయన్స్ ఆధిపత్యం వహిస్తున్న పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి ప్రవేశించడానికి అదానీ గ్రూప్ ఇటీవలే అదానీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. అదే విధంగా 5G స్పెక్ట్రమ్ ఎయిర్‌వేవ్‌ల విషయంలోనూ రెండు కంపెనీలు పోటీపడ్డాయి. ఇప్పుడు ఈ జాబితా మీడియా, పునరుత్పాదక శక్తి మొదలైన అనేక రంగాలలో వస్తోంది.

ఒప్పందం కొత్త కాదు..

ఒప్పందం కొత్త కాదు..

ఇలాంటి నిరోధక ఒప్పందం దేశంలో కొత్త కాదు. చాలా కాలంగా వాడుకలో ఉంది. నైపుణ్యం, అనుభవజ్ఞులైన ఉద్యోగులకు పెరుగుతున్న డిమాండ్ ప్రత్యర్థి కంపెనీల నుంచి ఇప్పటికే ఉన్న ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలను ప్రేరేపిస్తుంది. కానీ అధిక జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉన్నందున ఇది కంపెనీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల కంపెనీలు ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటుంటాయి.

 కోర్టుకు వెళ్లటం కుదరదు..

కోర్టుకు వెళ్లటం కుదరదు..

ఇలాంటి ఒప్పందాలకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలు లేవు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లలేరు. కానీ అలాంటి ఒప్పందం కొన్ని సమయాల్లో లాభదాయకంగా ఉండవచ్చు కానీ ఇతర సమయాల్లో ఇది హానికరం. ఈ విషయంలో అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించబోవని నిపుణులు భావిస్తున్నారు.

Read more about: adani ambani business news jobs
English summary

adani and ambani got to agrement over employees recruitment to cut costs with competetion

adani and ambani got to agrement over employees recruitment to cut costs with competetion
Story first published: Thursday, September 22, 2022, 18:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X