September GST Collections: సెప్టెంబర్‎లో రూ.2 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు..

సెప్టెంబర్ లో భారత ప్రభుత్వం స్థూల వస్తు సేవల పన్ను (GST) గణాంకాలను గురువారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం సెప్టెంబర్ లో రూ. 2,03,521 కోట్లు జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 14.7% ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (ఏప్రిల్-సెప్టెంబర్) మొత్తం స్థూల వసూళ్లు 11.6% పెరిగి రూ. 12,46,278 కోట్లకు చేరాయి. సెప్టెంబర్‌లో పన్ను వాపసులు (refunds) 3% తగ్గి రూ. 27,001 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ వసూళ్లలో CGST రూ. 37,762 కోట్లు ఉండగా.. SGST రూ. 45,363 కోట్లుగా ఉంది. ఇక IGST రూ. 1,20,396 కోట్లుగా ఉన్నాయి.

మొత్తం నికర GST ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18.1% పెరిగి రూ. 1,76,520 కోట్లకు చేరింది. భారతదేశ స్థూల దేశీయ ఆదాయం రూ. 1,25,334 కోట్ల నుంచి 10.1% పెరిగి రూ. 1,37,996 కోట్లకు పెరిగింది. నికర దేశీయ ఆదాయం 13.5% పెరిగి రూ. 1,24,491 కోట్లకు చేరింది. ప్రధాన రాష్ట్రాలలో మహారాష్ట్ర సెప్టెంబర్‌లో అత్యధికంగా రూ. 29,986 కోట్ల GST వసూళ్లను నమోదు చేసింది . ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక రూ. 13,884 కోట్ల వసూళ్లతో (16% వృద్ధి) నిలవగా, గుజరాత్ GST ఆదాయం 17% పెరిగి రూ. 12,222 కోట్లకు చేరింది. ఉత్తరప్రదేశ్ GST ఆదాయం గత ఏడాది రూ. 7,516 కోట్ల నుంచి 18% పెరిగి సెప్టెంబర్‌లో రూ. 8,882 కోట్లకు చేరింది.

GST

తెలంగాణ కూడా 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ వసూళ్లు రూ. 4,512 కోట్ల నుంచి రూ. 5,327 కోట్లకు పెరిగాయి. పంజాబ్ జీఎస్టీ ఆదాయం 18 శాతం పెరిగి రూ. 2,549 కోట్లకు చేరింది. అస్సాంలో GST వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 88 శాతం పెరిగి రూ. 1,287 కోట్ల నుంచి రూ. 2,415 కోట్లకు చేరాయి. మణిపూర్ 145 శాతం వృద్ధితో రూ. 92 కోట్లను నమోదు చేయగా, అరుణాచల్ ప్రదేశ్ 46 శాతం, నాగాలాండ్ 39% వృద్ధిని నమోదు చేశాయి. సెప్టెంబర్ నెలలో అనేక రాష్ట్రాలు GST వసూళ్లలో తగ్గుదలను నమోదు చేశాయి.

సిక్కింలో జీఎస్టీ వసూల్లు భారీగా తగ్గాయి. 51 శాతం తగ్గి రూ. 194 కోట్లకు పడిపోయింది. జమ్మూ కాశ్మీర్ వసూళ్లు 29% తగ్గి రూ. 487 కోట్లకు చేరగా, ఉత్తరాఖండ్ 23% తగ్గుదలతో రూ. 1,277 కోట్లను, హిమాచల్ ప్రదేశ్ 21% తగ్గుదలతో రూ. 640 కోట్లను నమోదు చేశాయి. తమిళనాడు GST ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5% తగ్గి రూ. 10,188 కోట్లకు పడిపోగా, గోవా వసూళ్లు 7% తగ్గి రూ. 494 కోట్లకు చేరాయి. పుదుచ్చేరి 31% తగ్గుదలతో రూ. 179 కోట్లను నమోదు చేయగా, మేఘాలయ వసూళ్లు 14% తగ్గి రూ. 164 కోట్లకు చేరాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+