ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (AMFI) విడుదల చేసిన డేటా ప్రకారం, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు తగ్గడంతో జూలైలో ఓపెన్-ఎండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్‌ఫ్లోలు 8.61 శాతం తగ్గి రూ. 37,113.39 కోట్లకు పడిపోయాయి.
డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఈ నెలలో రూ.1,19,587.60 కోట్ల నికర ఇన్‌ఫ్లోలు వచ్చాయి. మొత్తంమీద ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఈ నెలలో రూ. 1,89,141.39 కోట్ల నికర ఇన్ ఫ్లో వచ్చింది.
ఓపెన్-ఎండ్ ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోలు వరుసగా 41వ నెలలో పాజిటివ్ జోన్‌లో ఉన్నాయి. జులైలో, బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 3.43 శాతం లాభపడగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 3.92 శాతం పెరిగింది. అంతకుముందు, జూన్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోలు 17 శాతం పెరిగి రూ.40,608.19 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న నికర ఆస్తులు (AUM) జూలైలో రూ. 64,96,653.14 లక్షల కోట్లకు చేరుకున్నాయని డేటా బట్టి తెలుస్తోంది. పరిశ్రమ నికర AUM జూన్‌లో మొదటిసారిగా రూ. 60 లక్షల కోట్ల స్థాయిని అధిగమించింది.

గత వారంపది రోజులుగా స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగుతోన్నాయి. దీంతో మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు తగ్గుతున్నాయి. ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో భారీ పతనం కనిపిస్తోంది. అయితే మ్యూచువల్ ఫండ్లలో సిప్ ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడి మంచి ఫలితాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications