రూ.26,300 సంపాదిస్తే మిగిలింది రూ.300.. వైరల్ అవుతున్న వీడియో..

ఈ రోజుల్లో ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. రూమ్ రెంట్, మొబైల్ రీఛార్జ్, వివిధ ఖర్చులు భారీగా పెరిగాయి. అయితే నెలంతా పని చేస్తే వచ్చే జీతం క్షణాల్లో మాయమవుతుంది. తాజాగా ఓ మహిళా ఉద్యోగి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. "Story of a Salaried Employee" పేరుతో ఆమె చేసిన వీడియోలో డివిడెండ్లు, బ్యాంక్ వడ్డీ వంటి మార్గాల ద్వారా ఏడాది పొడవునా రూ.26వేల 600 అదనంగా సంపాదించానని పేర్కొంది. అయితే ఆ ఆదాయంపై పన్నులు, వడ్డీ కలిపి దాదాపు రూ.26వేల 300 చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. దీంతో తనకు చివరికి రూ.300 మాత్రమే మిగిలాయని తెలిపింది. ఆమె జీతంపై ఏడాది మొత్తం కంపెనీ ముందుగానే ట్యాక్స్ డిడక్షన్ చేసిందని ప్రియల్ పాల్ తెలిపారు.

అయితే డివిడెండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ వంటి ఆదాయం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద చేరడంతో మొత్తం పన్ను పరిధిలోకి వచ్చిన ఆదాయం పెరిగిందని పేర్కొంది. దీంతో అదనంగా దాదాపు రూ.24వేలు పన్ను చెల్లించాల్సి వచ్చిందని వివరించింది. మార్చి 31 తర్వాత పన్ను చెల్లించడం వల్ల మరో రూ.2వేల వరకు వడ్డీ కూడా పడిందని ప్రియల్ పాల్ గుర్తు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏడాదిలో 2 నుంచి 4 నెలలు ప్రభుత్వానికే పనిచేస్తున్నట్లుందని ఒకరు కామెంట్ చేస్తున్నారు.

Salary

మరికొందరు జీతం వచ్చినప్పుడు ఆదాయ పన్ను, డబ్బు బ్యాంకులో ఉంచితే వడ్డీపై పన్ను, పెట్టుబడులపై పన్ను, ఖర్చు చేస్తే జీఎస్టీ వంటి పరోక్ష పన్నులు కూడా చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీంతో మధ్యతరగతి ఉద్యోగులపై పన్ను భారం పెరుగుతోందనే చర్చ మొదలైంది. ఇటీవల ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సమయంలో ఇలాంటి చర్చలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి. పన్నుల చెల్లింపునకు తగ్గట్లుగా ప్రభుత్వ సేవలు ఉండడం లేదని కొంత మంది చెబుతున్నారు. డివిడెండ్లు, బ్యాంకు వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుందని పన్ను నిపుణులు గుర్తు చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తను ఉద్యోగం చేసినప్పుడు రూ.లక్షల పన్ను చెల్లించానని పేర్కొన్నారు. కానీ తను ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయానని వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సపోర్ట్ లేదని చెప్పారు. ఈ పోస్ట్ పై కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+