ఎప్పుడైనా ఊహించారా? ఒక గ్రామంలో ప్రతి రైతు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు? ఇది ఎక్కడైనా సినిమా కథలా అనిపించొచ్చు... కానీ ఇది కేరళలోని ఎలెవంచెరి అనే చిన్న గ్రామం వాస్తవం.
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని చిన్న గ్రామం ఎలెవంచెరి. ఇక్కడ సుమారు 300 కుటుంబాలు కలసి కూరగాయల సాగుతో సంవత్సరానికి రూ. 16 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇది ఎలాంటి లాటరీ గెలవటం వల్ల కాదు. ఎలాంటి భారీ సబ్సిడీలు కూడా రావు. వీరి విజయానికి రహస్యం సమూహ కృషి, రిస్క్ పంచుకోవడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులే కారణం.

1996లోనే వారు కేరళలోని కూరగాయలు మరియు పండ్ల ప్రమోషన్ కౌన్సిల్ (VFPCK) ఆధ్వర్యంలో ఒక స్వయం సహాయక రైతు సంఘం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి దశలో పంటను వేయటం, నీరు పెట్టటం, ఎరువులు వేయటం, కీటక నియంత్రణ, కోత, మార్కెట్‌కి పంపటం ఇలా అన్నీ కలిసే చేసుకుంటారు. మధ్యవర్తులు లేరు. అప్పుల భారం లేదు. ఖర్చులు, లాభాలు, నష్టాలు ఇవన్నీ అందరూ సమానంగా పంచుకుంటారు.
ఎలెవంచెరిలోకి అడుగుపెడితే, చుట్టూ పచ్చగా మెరుస్తున్న పొలాలు కన్పిస్తాయి. ఇక్కడ దాదాపు 30 రకాల సంప్రదాయ కూరగాయలు పండిస్తున్నారు. బూడిద గుమ్మడికాయ, పొట్లకాయ, లాంగ్ బీన్స్, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, గుమ్మడికాయ... ఇంకా మరెన్నో.
ప్రతి ఏడాది సుమారు 5,000 టన్నుల కూరగాయలు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఒక్క గ్రామం ఇప్పుడు కేరళలోనే అతిపెద్ద కూరగాయల ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది. కొంతమంది రైతులు తమ భూముల్లోనే సాగు చేస్తుంటే, మరికొందరు వారికి సొంత భూమి లేకపోయిన లీజు భూముల్లో పండిస్తున్నారు. సమీప పంచాయతీలకు కూడా ఈ విజయ మోడల్ విస్తరించింది.
ఈ రైతులు చేసిన అత్యంత గొప్ప పని ఏమిటంటే మధ్యవర్తులను పూర్తిగా తొలగించేశారు. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచీ కొనుగోలుదారులు నేరుగా ఎలెవంచెరికి వచ్చి వీరి పంటలను కొనుగోలు చేస్తున్నారు. మిగిలిపోయిన ఉత్పత్తిని మాత్రం VFPCK నెట్‌వర్క్ ద్వారా కేరళ అంతటా ఉన్న మార్కెట్లకు పంపుతున్నారు.
ఇంత పెద్ద స్థాయిలో వ్యవసాయం చేస్తున్న వీరి ఫారంలు ఇప్పుడు ఇతర ప్రాంతాల రైతులకు కూడా ఒక రకంగా శిక్షణ కేంద్రాల్లా మారిపోయాయి. ఎవరైనా వచ్చి వీరి పద్ధతులు నేర్చుకోవచ్చు. వీరు కూడా దానికి పూర్తిగా ఓపెన్‌గా ఉంచారు. మార్కెట్‌లో ఎప్పుడైనా అమ్ముడుకాని పంట మిగిలితే, దాని నష్టాన్ని కూడా అందరూ కలసి పంచుకుంటారు. ఇలా ఒకరికొకరు భారం తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
వీరి విజయానికి వెనక ఉన్న గోల్డెన్ సూత్రం చాలా సింపుల్ "ఆధునిక టెక్నాలజీని సంప్రదాయ జ్ఞానంతో కలపడమే. పాత పద్ధతుల్లో ఉన్న మంచి అంశాలను వదిలిపెట్టకుండా, కొత్త టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. తాత్కాలిక షెడ్లకు బదులుగా బలమైన, స్థిరమైన పావిలియన్లు నిర్మించడం వల్ల దీర్ఘకాల ఖర్చులు చాలా తగ్గాయి. పంటలకు నీటిని సమర్థంగా అందించేందుకు వ్యవస్థీకృత నీటి పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. రసాయనాలపై ఆధారపడకుండా, ఆర్గానిక్ పీడక నివారణ పద్ధతులను పాటిస్తున్నారు.
ఇక భూమి పరీక్షలు చేసి, ఆ మట్టి పరిస్థితులకు సరిపడే విత్తనాలనే ఎంచుకోవడం వల్ల పంట నాణ్యత పెరిగి, మార్కెట్లో ప్రీమియం ధరలు దక్కుతున్నాయి. ఇలా "సున్నా వ్యర్థం - గరిష్ట లాభం" అనే సూత్రాన్నే వీరు అమలు చేస్తున్నారు. ఇక్కడి రైతుల సగటు వయస్సు కేవలం 35 సంవత్సరాలు. యువత వ్యవసాయంలోకి రావడంతో ఉత్సాహం, శ్రమ రెండూ విపరీతంగా పెరిగాయి. వీరు వ్యవసాయం కూడా లాభదాయకమైన వ్యాపారమే అని చూపించారు.
ఎలవంచెరి రైతుల విజయగాథ మన దేశానికి కొన్ని గొప్ప పాఠాలు చెబుతుంది. ఇక్కడ వారు పోటీ పడకుండా, అందరూ ఒకటిగా కలిసి పనిచేసినందు వల్లే ఇంత పెద్ద విజయం సాధించారు. ఎవరైనా నష్టపోయినా, దాన్ని అందరూ పంచుకోవడం వల్ల ఎవ్వరూ ఒంటరిగా బరువును మోయాల్సి రాలేదు. ఈ రిస్క్ పంచుకోవడమే ఎక్కువ లాభాలకు కారణం అయింది.
ఇక ముఖ్యంగా యువత వ్యవసాయంలోకి రావడం వాళ్ల ఫారంలకు కొత్త ఊపిరి వచ్చింది. "యువత + వ్యవసాయం = బంగారం" అని వీరే నిరూపించారు. అలాగే, ఎక్కువ పంట దిగుబడికి మాత్రమే కాకుండా, పంట నాణ్యతపై దృష్టి పెట్టడం ద్వారా మార్కెట్లో మంచి ధరలు దక్కించుకున్నారు. సరైన విత్తనాలు, నేల పరీక్షలు చేయడం వల్ల నాణ్యమైన పంటలు పండించి, వాటిని ప్రీమియం ధరలకు అమ్ముతున్నారు.
భారతదేశంలో దాదాపు 52% మంది ఇంకా వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. ఇతర రాష్ట్రాలకే కాదు... దేశానికే ఆదర్శం ఎలవంచెరి మోడల్. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, అంత ముఖ్యమైన రంగంలో పనిచేస్తున్న రైతుల ఆదాయం మాత్రం సంవత్సరానికొకసారి తగ్గిపోతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఎలవంచెర్రీ మోడల్ దేశానికి ఆశాకిరణంలా మారొచ్చు. ఈ విధానంను పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే, అక్కడి గ్రామాలు మళ్లీ జీవంతో నిండిపోతాయి. వీరి మాటల్లో చెప్పాలంటే "మాకు సబ్సిడీలు వద్దు... మాకు మార్కెట్లు కావాలి."
సబ్సిడీలతో కాదు, సరైన మార్కెట్లతోనే రైతుల భవిష్యత్తు మారుతుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications