SSY: సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉందా.. అయితే మార్చి 31 లోపు ఈ పని చేయండి..
'బేటీ బచావో బేటియో పఢావో' భాగంగా కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని ప్రారంభించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఈ పథకంలో సంవత్సరానికి రూ.1.50,000 పన్ను మినహాయింపు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటును 8.2 శాతంగా చెల్లిస్తుంది. ఈ SSY వడ్డీ రేటు ప్రతి త్రైమాసికంలో మారవచ్చు కానీ మెచ్యూరిటీ సమయంలో దాదాపు 8 శాతం నికర రాబడిని ఆశించవచ్చు.
SSY ఖాతాలో నెలకు రూ.12,500 లేదా సంవత్సరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, ఆ అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేసరికి దాదాపు రూ.69 లక్షలు వస్తాయి. అమ్మాయికి 14 ఏళ్లు వచ్చిన నుంచి అమ్మాయికి 18 ఏళ్లు మధ్య మెచ్యూరిటీ మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మెచ్యూరిటీ మొత్తాన్ని ఆడపిల్లకి 21 ఏళ్లు వచ్చినప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు.

సుకన్య సమృద్ది యోజన పథకం ఖాతా పోస్టాఫీస్ లో తెరవచ్చు. ఈ పథకంలో మీరు నెలనెలా జమ చేయవచ్చు లేదా రెండు లేదు మూడు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి జమ చేయవచ్చు. సంవత్సరంలో రూ.1,50,000 జమ చేసే వరకు ఎన్నిసార్లైనా ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు. ఈ ఫథకంలో సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయాలి. గరిష్ఠంగా రూ.1,50,000 జమ చేయవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన ఫథకంలో సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయకుంటే ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. ఈ ఖాతా ఉన్నవారు ఇప్పటికీ కూడా కనీసం రూ.250 కూడా చెల్లించకపోతే.. మార్చి 31 లోపు రూ.250 చెల్లించాలి. లేకుంటే ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది.


Click it and Unblock the Notifications