హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో జరిగిన విషాద ఘటన మనందరినీ ఆలోచింప జేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వి. పవన్ కుమార్ (24) ఎల్లారెడ్డిగూడలోని ఓ పేయింగ్ గెస్ట్ లో ఉంటూ మృతిచెందారు. తన వయస్సు చిన్నదైనప్పటికి, జీవితంపై ఎన్నో ఆశలు, లక్ష్యాలతో ముందుకుసాగాల్సిన వ్యక్తి. ఆన్‌లైన్ రమ్మీ ఆటలకు అలవాటు పడి అతని జీవితంని ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది.

ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న పవన్, మొదట వినోదంగా ఆడిన రమ్మీ, క్రమంగా అతని అలవాటుగా మారింది. చిన్నగా మొదలైన బెట్టింగ్‌లు పెద్ద మొత్తాలకి చేరడంతో, నష్టాలను కప్పేందుకు అతను ఆన్‌లైన్ లోన్ యాప్స్ ద్వారా అప్పులు తీసుకుంటూ పోయాడు. ఒకసారి అప్పు ప్రారంభమైన తర్వాత, మరో యాప్ నుంచి తీసుకుని అప్పును కడతాను అన్న ఆలోచనలో నిండా మునిగిపోయాడు.
కొన్ని నెలల క్రితం, ఆన్‌లైన్ జూదంలో పడిన రూ.50,000 అప్పును ఆయన తండ్రి తీర్చారు. కొడుకు మళ్లీ మారిపోతాడని ఆశించారు. కానీ అదే చక్రం మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల నాలుగు మొబైల్ లెండింగ్ యాప్స్ నుంచి రుణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. "మళ్లీ కుటుంబానికి చెప్పలేక, తీవ్ర ఒత్తిడిలో ఈ ఘోర నిర్ణయం తీసుకున్నాడు," అని పోలీసు అధికారి తెలిపారు. "సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు. కానీ ఆయన ఫోన్‌లో పరిశీలన చేస్తే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది," అని పోలీసులు చెప్పారు.
ఆర్థిక ఒత్తిడి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, అప్పుల ఒత్తిడి అన్నీ కలిసివచ్చి పవన్‌ను మానసికంగాఇబ్బంది పెట్టి ఈలాంటి తీవ్ర స్థితికి తీసుకొచ్చాయి. చివరకు, ఇంట్లో ఎవరికి చెప్పకుండానే అతను తన ప్రాణాలను తీసుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చాడు. అతని ఫోన్‌లో ఉన్న చాట్‌లు, యాప్ యాక్టివిటీలు చూస్తే ఎంతమేరకు ఆన్‌లైన్ గేమింగ్ జీవితాన్ని నియంత్రించగలదో స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ ఘటన మనలన్నీ ఆలోచింపజేసే పరిస్థితిలోకి తీసుకెళ్లింది. వినోదం పేరుతో ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్, ఎంతోమందిని ఆర్థికంగానే కాక మానసికంగా కూడా కుంగదీస్తున్నాయి. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌కి గట్టి నియంత్రణలు అవసరం. అలాగే, మన చుట్టూ ఉన్నవారిలో ఎవరికైనా హఠాత్తుగా ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే, వారికి సన్నిహితంగా సహాయం చేయాల్సిన బాధ్యత మనదే.
ఇప్పటిరోజుల్లో ఆన్‌లైన్ లోన్ యాప్స్ యువత జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ యాప్స్ చాలా తక్కువ డాక్యుమెంటేషన్‌తో, గంటల వ్యవధిలో లోన్ మంజూరు చేస్తున్న కారణంగా చాలామంది ఆలోచించకుండా అప్పు తీసుకుంటున్నారు. మొదట చిన్న మొత్తాల్లో మొదలై, రీపే చేయలేని స్థితికి చేరిన తర్వాత మరో యాప్ నుంచి లోన్ తీసుకొని గత అప్పును తీర్చే ప్రయత్నం చేస్తూ వారు అప్పుల చక్రంలో చిక్కుకుంటున్నారు.
ఇవి సాధారణ బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తూ, ఎలాంటి నియంత్రణ లేకుండా ప్రవర్తిస్తున్నాయి. రీపేమెంట్ చేయలేని పరిస్థితుల్లో వారు లోన్ తీసుకున్నవారి పై మానసిక ఒత్తిడి తేవడమే కాదు ఫోన్ లోని పరిచయాలు, ఫోటోలు, లొకేషన్ లాంటి వ్యక్తిగత డేటాను కూడా యాక్సెస్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఈ బెదిరింపులు, వారి ప్రతిష్ట నాశనం అవుతుందన్న భయం యువతను తీవ్ర డిప్రెషన్‌లోకి నెట్టేస్తోంది. ఫలితంగా, జీవితంలో స్థిరపడకముందే 20-25 ఏళ్ల వయస్సులోనే రమ్మీ, బెట్టింగ్, లోన్ యాప్స్ వలయానికి చిక్కి ప్రాణాలను కోల్పోతున్నారు. యువత ఈ వలయానికి లోనవకుండా, కుటుంబ సభ్యులు, స్నేహితులు వారిని పర్యవేక్షిస్తూ, మాట్లాడుతూ మానసికంగా దగ్గరుండే అవసరం ఎంతైనా ఉంది. ఈ లోన్ యాప్స్‌పై నియంత్రణ అవసరం, అదే సమయంలో ప్రతి యువకుడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకరి కథ కాదు, ఈ తరం యువత ఎదురు చూస్తున్న మౌన భయంకర యుద్ధం.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications