ఐటి రంగంలో ఉదోగాల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు పెద్ద పెద్ద కంపెనీలకే పరిమితమైన లేఆఫ్'లు ఇప్పుడు స్టార్ట్ అప్స్ ఇంకా చిన్న కంపెనీలకు కూడా పాకుతుంది. ఈ రోజుల్లో ఒక కంపెనీ నుండి ఉద్యోగులను తొలగించడం చాలా కామన్ అయిపోయింది. వర్క్ పెరిగినప్పుడు కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటుంటాయి. అదే పని పూర్తి అయ్యాక లేదా ఏదైనా చిన్న సమస్య తలెత్తినప్పుడు ఉద్యోగులను తొలగిస్తారు. తాజాగా ఒక కంపెనీ సీఈఓ 70 మంది ఉద్యోగులను తొలగించారు. దీని తరువాత కూడా ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఎందుకు, ఏంటి విషయం అనుకుంటున్నారా...

హర్ష్ పోఖర్ణ ఓకేక్రెడిట్ అనే కంపెనీకి సీఈఓ. అతను ఇటీవల లింక్డ్ఇన్‌లో ఒక పోస్ట్ చేశాడు. ఇందులో తన కంపెనీ కొంతకాలం క్రితం కొంతమంది ఉద్యోగులను తొలగించిందని చెప్పారు. కాగా వారిని ఉద్యోగం నుండి తొలగించే ముందు వేరే చోట ఉద్యోగం సంపాదించడానికి సహాయం చేశానని కూడా చెప్పాడు. తొలగించిన వారిలో దాదాపు అందరికీ వేరే చోట ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాని వారికి కొత్త ఉద్యోగం వచ్చే వరకు ఎటువంటి సమస్య ఎదురుకాకూడదని ఎక్కువ డబ్బు ఇచ్చి వీడ్కోలు పలికారు.
పోస్ట్ లో ఏం రాసి ఉందంటే : హర్ష్ పోఖర్ణ చేసిన పోస్ట్‌లో '18 నెలల క్రితం మేము 70 మందిని తొలగించాము. ఇది ఎలా జరిగిందంటే, మేము చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాము అందుకే వేగంగా చాలా ఎక్కువ మందిని నియమించుకున్నాము. అది మా తప్పు అండ్ మేము దానిని అంగీకరించాము కూడా. ఒక వ్యవస్థాపకుడిగా ఇది నాకు అత్యంత కష్టతరమైన విషయాలలో ఒకటి. కానీ మేము దానిని సరైన విధంగా చేయడానికి ప్రయత్నించాము అని అన్నారు. ఉద్యోగులను తొలగించిన తర్వాత వీరికి సహాయం చేయడానికి కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుందో ఆయన వివరించారు. ముందుగా, . మేము 70 మంది ఉద్యోగులలో ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడి, వారిని ఎందుకు తొలగిస్తున్నారో చెప్పాము" అని పోస్టులో రాశారు.
మూడు నెలల నోటీసు : కంపెనీ తొలగింపుల పై ఉద్యోగులకు మూడు నెలల నోటీసు కూడా ఇచ్చింది. దీని ద్వారా వారికీ కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి సమయం లభిస్తుంది. అంతే కాకుండా, ఓకేక్రెడిట్ వారికీ ఉద్యోగం దొరకడంతో కూడా సహాయపడింది. ఇంకా వారికి పరిచయం చేసి, ఉద్యోగాల గురించి సమాచారాన్ని అందించాడు. నోటీసు వ్యవధి ముగియకముందే 67 మందికి ఉద్యోగాలు లభించాయి' అని పోఖర్ణ అన్నారు. ఉద్యోగాలు రాని ముగ్గురికి రెండు నెలల అదనపు జీతం కూడా ఇచ్చాము అని అన్నారు.
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశంసలు: పోఖర్ణ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. దీనితో పాటు, అతని చర్యను కూడా ప్రశంసిస్తున్నారు. అతను చేసిన పనికి వ్యవస్థాపకులు, కార్యనిర్వాహకులు, నిపుణులు కూడా ఎంతో ప్రశంసించారు. కంపెనీలలో జరుగుతున్న తొలగింపుల పద్ధతిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. అవును, తొలగింపులు జరుగుతాయి, కానీ మీరు దానిని ఎలా నిర్వహిస్తారనేది మీ కంపెనీ గురించి ప్రతిదీ చెబుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications