జీవితంలో కొందరికి సులభంగా విజయం లభిస్తుంది. మరికొందరికి అది కష్టమైన మార్గంలో వస్తుంది. కష్టపడి విజయం సాధించిన వారే చరిత్రలో నిలిచిపోతారు. ఇలా గ్రామీణ భారతం నుంచి వచ్చిన ఓ మహిళ ఎంతో కష్టపడి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఆమె సంతోష్ వసునియా. ఈమె మధ్యప్రదేశ్‌లోని ఝబువా అనే చిన్న పట్టణానికి చెందినవారు.
కరోనా వైరస్ మహమ్మారి భారతదేశంలో పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు భారీ రివర్స్ వలసలు వచ్చారు. ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో వసునియా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంది. ఆమె తన సొంత సౌందర్య ఉత్పత్తుల దుకాణాన్ని తెరవాలని భావించింది. ఆమె తన సొంత పొదుపు రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టింది. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఆర్థిక సహాయంగా రూ. 3.75 లక్షలు కూడా పొందింది.

ఆమె ఇప్పుడు రిఫ్రెష్‌మెంట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ మొదలైన వాటితో డీల్ చేసే ఒక విజయవంతమైన స్టోర్‌ని ఏర్పాటు చేిసంది. ఈరోజు ఆమె తన కోసమే కాకుండా తన కుటుంబం కోసం సంపాదిస్తోంది. పది మందికి ఉపాధి కల్పిస్తోంది. " నాకు 4 సంవత్సరాల వయసులో మా నాన్న చనిపోయారు. మా అమ్మను రోజువారీ కూలీగా పని చేసేది. నేను 10వ తరగతి వరకు మాత్రమే చదవగలిగాను, ఆపై పెళ్లి చేసుకుని, నా భర్త, ఇద్దరు పిల్లలతో పెట్లవాడలో స్థిరపడ్డాను"అని సంతోష్ వసునియా చెప్పారు.
"నేను ట్రాన్స్‌ఫార్మ్ రూరల్ ఇండియా (TRI) ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెసిలిటేషన్ హబ్ బృందంతో సన్నిహితంగా ఉన్నాను. వారి సహాయంతో, నేను నా స్వంత సంస్థను ప్రారంభించే దిశగా పని చేశాను" అని సంతోష్ వసునియా వివరించారు.


Click it and Unblock the Notifications