8వ పే కమిషన్‌.. రైల్వే ఉద్యోగుల జీతం రూ. 18 వేల నుంచి 69 వేలకు.. NFIR కీలక ప్రతిపాదనలు ఇవే..

8th Pay Commission Update: విక్రమ్ సంవత్ నూతన సంవత్సరం వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయ రైల్వే సిబ్బంది ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం ముందు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ తమ కీలక డిమాండ్లను సమర్పించింది. ఏడవ వేతన సంఘం పరిమితులను అధిగమించి, ఉద్యోగుల ఆర్థిక భద్రతను మెరుగుపరిచే ప్రధాన లక్ష్యంతో సమర్పించిన ఈ విజ్ఞప్తిలో కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ప్రమోషన్లు, పింఛను ప్రయోజనాలపై పలు ప్రతిపాదనలు ఉన్నాయి.

ఏడవ వేతన సంఘం కింద ప్రస్తుతం అమల్లో ఉన్న కనీస మూల వేతనం 18 వేల రూపాయలుగా ఉండగా.. రైల్వే ఉద్యోగుల సమాఖ్య.. తమ సవరణలలో 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఉపయోగించి, ఈ కనీస ప్రాథమిక వేతనాన్ని ఏకంగా రూ. 69 వేల రూపాయలకు పెంచాలని The National Federation of Indian Railwaymen (NFIR) ప్రతిపాదించింది. ఈ డిమాండ్ ఆమోదం పొందితే దిగువ స్థాయి ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో భారీ మార్పు రావడంతో పాటు వారి జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయి.

8th Pay Commission Update 8th Pay Commission 8th CPC latest news Railway Employees Salary 69 000 Minimum Salary 3 83 Fitment Factor 6 Annual Increment Railway Staff Demands Central Government Employees Salary Hike 8 8 69 000 3 83 6 8th CPC

దీనికితోడు ప్రస్తుతం ఏటా లభిస్తున్న మూడు శాతంగా ఉన్న వార్షిక ఇంక్రిమెంట్‌ను ఆరు శాతానికి పెంచాలని కూడా సమాఖ్య కోరింది. ఈ సవరణ ద్వారా ప్రతి ఉద్యోగికి ప్రతి సంవత్సరం కనీసం రూ. 10 వేల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరేలా చూడాలని స్పష్టం చేసింది. ఇంక్రిమెంట్ రేటు పెరగడం అనేది కేవలం నెలవారీ జీతంపైనే కాకుండా అలవెన్సులు, రిటైర్‌మెంట్ ప్రయోజనాలపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.

Also Read

కెరీర్ పురోగతి విషయంలో ఉద్యోగులు దశాబ్దాల తరబడి ఒకే గ్రేడ్‌లో ఉండిపోకుండా ఉండేందుకు, ఒక ఉద్యోగి తన మొత్తం సర్వీసు కాలంలో కనీసం ఐదు ప్రమోషన్లు పొందేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని రైల్వే సమాఖ్య స్పష్టం చేసింది. సాధారణ ఇంక్రిమెంట్లు కేవలం ఉన్న వేతనంలో పెరుగుదలను ఇస్తే, ఈ పదోన్నతుల విధానం ఉద్యోగిని ఉన్నత వేతన శ్రేణిలోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇచ్చే కరువు భత్యం 25 శాతానికి చేరినప్పుడల్లా దానిని మూల వేతనంలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల జీతానికి సంబంధించిన ఇతర ప్రయోజనాలు మరియు పింఛను లెక్కించే విధానంలో ఉద్యోగులకు స్పష్టమైన మేలు జరుగుతుంది.

పదవీ విరమణ పొందిన, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెన్షన్‌లో కూడా మార్పులను కోరడం జరిగింది. ఇందులో భాగంగా చివరిగా తీసుకున్న మూల వేతనంలో పెన్షన్‌ను 67 శాతానికి పెంచాలని, అలాగే ఫ్యామిలీ పెన్షన్‌ను 50 శాతంగా నిర్ణయించాలని కోరారు. ప్రధానంగా కమ్యూట్ చేసిన పెన్షన్ పునరుద్ధరణ కాలాన్ని ప్రస్తుత పదిహేను సంవత్సరాల నుండి పదకొండు సంవత్సరాలకు తగ్గించాలని ప్రతిపాదించారు. దీనివల్ల పదవీ విరమణ పొందినవారు తమ పూర్తి పెన్షన్‌ను తక్కువ కాలంలోనే తిరిగి పొందే అవకాశం లభిస్తుంది.

గత నవంబర్ రెండొందల 25 న ఏర్పాటైన 8వ వేతన సంఘానికి తమ సిఫార్సులను సిద్ధం చేసేందుకు పద్దెనిమిది నెలల సమయం ఉంటుంది. అందువల్ల ఈ వేతన సంఘం యొక్క అంతిమ నివేదిక 2027 మే నాటికి వెలువడే అవకాశం ఉంది. అయితే ఎన్‌ఎఫ్‌ఐఆర్ సమర్పించిన ఈ ప్రతిపాదనలు కేవలం ఉద్యోగుల సమాఖ్య డిమాండ్లు మాత్రమేనని, వేతన సంఘం చేసే తుది సిఫార్సులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అధికారిక ఆమోదం ఆధారంగానే వాస్తవ వేతన సవరణ జరుగుతుందని ఉద్యోగులు గుర్తించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+