8వ వేతన సంఘం కీలక అప్‌డేట్.. రూ. 72 వేల జీతం.. 4.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు..

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యంత ప్రాధాన్యత కలిగిన 8వ వేతన సంఘం అమలు ప్రక్రియపై కీలకమైన అప్‌డేట్ వెలువడింది. లక్షలాది మంది ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల పెంపునకు సంబంధించి వివిధ జాతీయ ఉద్యోగ సంఘాలు తమ నివేదికలను సిద్ధం చేసి కమిషన్ ముందు ఉంచాయి.

ప్రస్తుతం అమలులో ఉన్న కనీస మూల వేతనాన్ని (Minimum Basic Pay) భారీగా పెంచాలని, అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, వార్షిక ఇంక్రిమెంట్‌లలో కీలక మార్పులు చేయాలని ఈ ప్రతిపాదనలు కోరుతున్నాయి. అయితే ఇవి కేవలం ఉద్యోగ సంఘాల డిమాండ్లు మాత్రమేనని.. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది.

8th Pay Commission 8th Pay Commission latest news central government employees salary hike 8th CPC demands Rs 69000 minimum salary 3 833 fitment factor DA merger demand 6 percent annual increment OPS restoration demand pension revision 8th Pay Commission salary increase 2026 8 8 69 3 833 6

8వ వేతన సంఘంలో కనీస వేతనం పెంపుపై ప్రధానంగా రెండు వేర్వేరు ప్రతిపాదనలు తీవ్ర చర్చకు దారితీశాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ (NC-JCM) కనీస ప్రాథమిక వేతనాన్ని రూ. 69,000గా నిర్ణయించాలని కోరుతూ 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రతిపాదించగా.. భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (BPMS) కనీస ప్రాథమిక జీతాన్ని అత్యధికంగా రూ. 72,000కు పెంచాలని ప్రతిపాదిస్తూ 4.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సమర్పించింది. దీంతో పాటు ప్రాథమిక జీతంలో ప్రస్తుతం ఇస్తున్న 3% వార్షిక ఇంక్రిమెంట్‌ను (Annual Increment) 6%కి రెట్టింపు చేయాలని NC-JCM స్పష్టంగా అభ్యర్థించింది.

Also Read

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది పాత వేతన స్కేలును కొత్త వేతన విధానంలోకి మార్చడానికి ఉపయోగించే ఒక గుణకం. ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద కనీస ప్రాథమిక జీతం రూ. 18,000గా ఉంది. ఒకవేళ ప్రభుత్వం BPMS ప్రతిపాదించిన 4.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఆమోదిస్తే.. కొత్త కనీస మూల వేతనం రూ. 18,000 కు 4.0 గుణించడం ద్వారా రూ. 72,000 కి చేరుతుంది. అయితే ఇది కేవలం సిద్ధాంతపరమైన ప్రతిపాదన మాత్రమేనని, అసలు వేతనం అనేది వేతన సంఘం ఇచ్చే తుది సిఫార్సులు, కేంద్ర కేబినెట్ ఇచ్చే ఆమోదంపైనే ఆధారపడి ఉంటుందని గుర్తించాలి.

కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తేదీ నుండి 18 నెలలలోపు తన సమగ్ర సిఫార్సులను సమర్పించాల్సి ఉంది. కమిషన్ ఇచ్చే తుది నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలించిన తదనంతరం ప్రభుత్వం అధికారిక ఆమోదం తెలపనుంది. కనీస వేతనం రూ. 69,000 నుండి రూ. 72,000 వరకు పెరిగే అవకాశం ఉండటంతో 48.54 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 68.71 లక్షల మంది పెన్షనర్లలో ఆశలు చిగురించాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+