IT refund: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ కు లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది. ఈసారి గడువు పొడిగింపునకు అవకాశం ఉండదని IT వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కాగా ఇంకా ఫైల్ చేయని వారు త్వరపడుతున్నారు. తాజాగా ఇప్పటివరకు జమైన, రీఫండ్ ఇచ్చిన రిటర్న్స్ పై CBDT ఛైర్ పర్సన్ నితిన్ గుప్తా అప్‌డేట్ ఇచ్చారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు అయినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) ఛైర్ పర్సన్ నితిన్ గుప్తా తెలిపారు. వాటిలో సగానికి పైగా ప్రోసెస్ చేశామన్నారు. 80 లక్షల క్లైమ్స రీఫండ్ చేసినట్లు ప్రకటించారు.

అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2022-23లో భారీగా పన్నులు వసూలైనట్లు ఆయన తెలిపారు. ఈసారి 16.61 లక్షల కోట్ల మేర ట్యాక్స్ కలెక్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే ఇది 17.67 శాతం ఎక్కువని వెల్లడించారు. వ్యక్తిగత, కార్పొరేట్ సహా ప్రత్యక్ష పన్ను వసూళ్లలో అద్భుతమైన పురోగతిని సాధించినట్లు ప్రకటించారు.
రిటర్నులను వేగవంతంగా ప్రాసెస్ చేయడం సహా త్వరితగతిన రీఫండ్‌లు జారీకి ఆర్థిక శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్లు CBDT ఛైర్ పర్సన్ చెప్పారు. ITR ప్రాసెసింగ్‌ను కేవలం 16 రోజులకు తగ్గించామని గుర్తుచేశారు. 42 శాతానికి పైగా ITRలు ఒక్కరోజులోనే ప్రాసెస్ చేసినట్లు తెలిపారు.
సిబ్బంది కొరత వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. కాగా రిక్రూట్మెంట్ కోసం ఆర్థిక శాఖను కోరినట్లు చెప్పారు. 164వ ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు.


Click it and Unblock the Notifications