భారత సంతతి చీఫ్ ఇంజినీర్ మూర్తి రెండుచింతాలను ఇంటెల్ కార్ప్ తొలగించింది. ప్రొడక్షన్ ఫెయిల్యూర్ నేపథ్యంలో ఆయనను కంపెనీ బాధ్యతల నుండి తప్పించింది. ప్రొడక్షన్ టెక్నాలజీలో వెనుకబడటంతో ఇంటెల్ కార్ప్ చిప్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీరింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆయన ఆగస్ట్ 3వ తేదీన కంపెనీనీ వీడుతున్నారు.

కీలక సాంకేతక విభాగం పునర్వ్యవస్థీకరణ
ఈ కీలక సాంకేతిక విభాగాన్ని ఐదు పార్టులుగా విభజించనుంది. టెక్నాలజీ, సిస్టమ్స్, ఆర్కిటెక్చర్ అండ్ క్లయింట్ గ్రూప్‌ను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపింది. ప్రాసెస్ టెక్నాలజీ అమలుపై మరింత దృష్టి, జవాబుదారీతనం పెంచేందుకు, ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు ఇంటెల్ తెలిపింది. కొత్త నాయకత్వం నేరుగా ఇంటెరిమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబ్ స్వాన్‌కు రిపోర్ట్ చేస్తుందని వెల్లడించింది.

7 నానోమీటర్ చిప్ టెక్నాలజీ ఆలస్యం
ఇంటెల్‌లో 24 ఏళ్ళుగా పని చేస్తున్న అనుభవజ్ఞుడు ఆన్ కెళ్లెహెర్ 7 నానోమీటర్, 5 నానోమీటర్ చిప్ టెక్నాలజీ ప్రాసెస్ డెవలప్‌మెంట్ ప్రక్రియకు నాయకత్వం వహిస్తారు. 7 నానోమీటర్ చిప్ మేకింగ్ టెక్నాలజీ అనుకున్న దాని కంటే ఆరు నెలలు వెనుకబడి ఉందని గత వారం ఇంటెల్ పేర్కొంది. 2022 వరకు సమయం తీసుకోవచ్చునని పేర్కొంది. పోటీలో నిలదొక్కుకునేందుకు బయటి చిక్ మేకర్స్ పైన ఎక్కువ ఆధారపడవలసి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇన్వెస్టర్ల భేటీలో
మూర్తి రెండుచింతాల 2015లో ఇంటెల్‌లో చేరారు. 2018 ఏప్రిల్ నుండి యాక్సెంచర్ బోర్డులో ఉన్నారు. క్వాల్‌కామ్ ఇంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గతంలో ఉన్నారు. ఇంటెల్ వెలుపలి నుండి జరిగిన కీలక నియామకాల్లో మూర్తి ఒకరు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్(CPU)తో పాటు విస్తృత మార్కెట్ వ్యూహంలో భాగంగా అతనిని నియమించారు. 7 నానోమీటర్ ప్రాసెస్ 2021 ప్రారంభంలో ఉంటుందని సీఈవో స్వాన్ గత ఏడాది ఇన్వెస్టర్ల భేటీలో వెల్లడించారు. అయితే ఇది ఆలస్యమవుతుందని గత వారం వెల్లడించారు.


Click it and Unblock the Notifications