దశాబ్దాలుగా భారత అణు శక్తి రంగంలో థోరియం ఒక కీలక స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద థోరియం నిల్వలు భారత్ వద్ద ఉండటంతో.. ఇది స్వచ్ఛమైన శక్తి, దీర్ఘకాలిక ఇంధన భద్రత, స్వావలంబనకు మార్గంగా భావించారు. ఈ ఆశయానికి రూపకల్పనగా హోమీ జె. బాబా ప్రతిపాదించిన మూడు-దశల అణు విద్యుత్ కార్యక్రమం నిలిచింది. దేశంలో పరిమితంగా ఉన్న యురేనియంను మొదట ఉపయోగించి.. తదుపరి దశలో థోరియంను వాణిజ్య విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలన్నది ఆ వ్యూహంగా చెప్పవచ్చు.
ఈ దిశగా భారత శాస్త్రవేత్తలు గట్టి పునాది రాయిని సెట్ చేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో థోరియం ఇంధనంపై వందలాది శాస్త్రీయ పత్రాలు వెలువడ్డాయి. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లలో (PHWRs) థోరియం ఆక్సైడ్ గుళికల పరీక్షలు జరిగాయి. కల్పక్కంలో ఉన్న కామిని (KAMINI) రియాక్టర్.. థోరియం నుంచి ఉత్పత్తి చేసిన యురేనియం-233తో విజయవంతంగా పనిచేసింది. ఇవన్నీ థోరియం వెనుక ఉన్న పరిశోధన పనిచేస్తుందని నిరూపించాయి.

అయితే 2025 నాటికీ భారత్ వాణిజ్య స్థాయిలో థోరియం ఆధారిత ఇంధనాన్ని తన విద్యుత్ గ్రిడ్‌లో ప్రవేశపెట్టలేకపోయింది. థోరియం వినియోగానికి ప్రత్యేకంగా రూపొందించిన అడ్వాన్స్‌డ్ హెవీ వాటర్ రియాక్టర్ (AHWR) ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా చర్చలకే పరిమితమైంది. లైసెన్సింగ్, నిధులు, విధానపరమైన ఆలస్యాల కారణంగా అది ఇప్పటికీ కాగితాల మీదే ఉంది.
ఇదే సమయంలో.. ఊహించని చోటు నుంచి పురోగతి వచ్చింది. అమెరికా కేంద్రంగా పనిచేసే ఒక చిన్న ప్రైవేట్ సంస్థ.. క్లీన్ కోర్ థోరియం ఎనర్జీ (CCTE) భారతీయ PHWRలకే అనువైన థోరియం ఆధారిత ఇంధనాన్ని అభివృద్ధి చేసింది. ANEEL (Advanced Nuclear Energy for Enriched Life)గా పిలువబడే ఈ ఇంధనం ఇప్పటికే ఉన్న రియాక్టర్లలో స్వల్ప మార్పులతో ఉపయోగించవచ్చని నిరూపించింది. ఇడాహో నేషనల్ ల్యాబ్‌లో జరిగిన పరీక్షలు ఈ ఇంధనం అధిక ఒత్తిడి పరిస్థితుల్లోనూ స్థిరంగా పనిచేస్తుందని రుజువు చేశాయి.
ఈ కంపెనీని 2017లో భారత సంతతికి చెందిన మెహుల్ షా స్థాపించారు. దాదాపు 15.5 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించిన ఈ సంస్థకు.. భారత అణు శక్తి కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ అనిల్ కకోద్కర్ వంటి ప్రముఖులు సలహాదారులుగా ఉండటం గమనార్హంగా చెప్పవచ్చు. అయితే దీనిని తప్పు పట్టలేం కానీ భారతదేశంలో దశాబ్దాలుగా జరిగిన పరిశోధన ఫలితం.. వాణిజ్య రూపంలో విదేశీ సంస్థ ద్వారా ముందుకు రావడం సహజంగానే అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఆలస్యానికి సాంకేతిక సమస్యలతో పాటు విధాన మార్పులు కూడా కారణం. thorium స్వయంగా విచ్ఛిత్తి చెందదు. ముందుగా యురేనియం-233గా మారాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు అధునాతన రియాక్టర్లు, రీ ప్రాసెసింగ్ సాంకేతికత అవసరం. 2008 ఇండో-యుఎస్ అణు ఒప్పందం తర్వాత భారత్‌కు విదేశీ యురేనియం సులభంగా లభించడం వల్ల, థోరియం పై అత్యవసరత తగ్గిపోయింది. ఫలితంగా ప్రాధాన్యతలు మారాయి.
క్లుప్తంగా చెప్పాలంటే ఇది శాస్త్ర వైఫల్యం కాదు. భారత శాస్త్రవేత్తలు పునాదిని బలంగా నిర్మించారు. కానీ ఆ పునాదిపై వాణిజ్య భవనం నిర్మించడంలో నిర్వహణ లోపాలు, సంస్థాగత లోపం, రిస్క్ తీసుకునే సమస్యలు అడ్డంకిగా మారాయి. డెబ్బై ఏళ్ల భారత్ కలను ఓ స్టార్టప్ తన్నుకుపోయింది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు భారత థోరియం కథ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications