ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి కోట్లాది రూపాయలు ఆర్జించిన ఆరోపణల పైన అమెరికాలో ఏడుగురు భారత సంతతి వ్యక్తులపై ఫెడరల్ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ స్కీం ద్వారా వీరు మిలియన్ డాలర్ల మేర లాభం పొందినట్లు పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం వీరు ఈ మోసానికి పాల్పడగా, ఆలస్యంగా వెలుగు చూసింది. హరిప్రసాద్ సూరె (34), లోకేష్ లగుడు(31), చోటు ప్రభు తేజ్ పులగమ్ (29) స్నేహితులు. వీరు ముగ్గురు స్వేహితులు ట్విలియోలో సాఫ్టువేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. ఈ కంపెనీ శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంది.
2020లో హరి ప్రసాద్ ట్విలియో కంపెనీ భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి రహస్య సమాచారాన్ని తన స్నేహితుడు దిలీప్ కుమార్ రెడ్డికి చేరవేశాడు. లోకేష్ తన గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితుడు అభిషేక్‌కు కంపెనీ విషయాలను చెప్పాడు. ప్రభుతేజ్ కూడా తన సోదరుడు చేతన్ ప్రభుకు తెలిపాడు.

కంపెనీ సమాచారం అందుకున్న వారు ట్విలియో ఆప్షన్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా ట్రేడిగ్ చేశారు. 2020 మార్చిలో ఈ స్నేహితులు ముగ్గురు ట్విలియో రెవెన్యూకు సంబంధించిన డేటా బేస్‌లను యాక్సెస్ చేశారు. దీని ద్వారా కంపెనీ కస్టమర్లు సమాచారాన్ని తెలుసుకున్నారు. కరోనా సమయంలో ట్విలియో కంపెనీ ఉత్పత్తులు, సేవల వినియోగం పెరిగింది.
ఈ వివరాలతో కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో వెల్లడిస్తే కచ్చితంగా ట్విలియో షేర్ల ధర పెరుగుతుందని గుర్తించారు. ఈ విషయాన్ని వారు తమ స్నేహితులు, బంధువులకు సమాచారం అందించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా ఈ ఏడుగురు 1 మిలియన్ డాలర్లకు పైగా అక్రమంగా ఆర్జించినట్లు దర్యాఫ్తులో తేలింది. ఇందులో తెలుగు వ్యక్తులు ఉన్నారు.


Click it and Unblock the Notifications