భారతీయుల ఎంటర్‌టైన్‌మెంట్ అలవాట్లు కాస్త మలుపు తిరుగుతున్నట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అందరూ OTTలకే మోజుపడి ఫోన్‌లోనే సినిమాలు, సిరీస్‌లు చూస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ కాస్త స్లో అవుతోంది. కొత్తగా బయటపడిన ఓర్మాక్స్ OTT ప్రేక్షకుల నివేదిక 2025 ప్రకారం, OTT వృద్ధి రేటు తగ్గుతుండగా... పెద్ద స్క్రీన్‌ల మీద కంటెంట్ చూడాలనే ఆసక్తి మాత్రం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా Connected TVల వినియోగం ఒక్కసారిగా పెరగడం పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ రిపోర్ట్ చెబుతున్నదేమిటంటే 2025 నాటికి భారత్‌లో మొత్తం OTT ప్రేక్షకుల సంఖ్య 601.2 మిలియన్లకు (దాదాపు 60.12 కోట్లకు) చేరిపోయింది. అంటే మన దేశ జనాభాలో 41% మందికి పైగా కనీసం నెలలో ఒక్కసారైనా ఆన్‌లైన్ వీడియో (ఫ్రీ గానీ పేడ్ గానీ) చూస్తున్నారు. ఈ అధ్యయనం 2025 జూన్-జూలై మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి 15,600 మంది సమాధానాల ఆధారంగా నిర్వహించారు.
ఈ సంఖ్యలు చూస్తే, భారతీయుల వినోదపు అలవాట్లు ఎంత వేగంగా డిజిటల్ వైపు మారుతున్నాయో అర్థమవుతోంది. అయితే ఈ వృద్ధి 2023, 2024లో నమోదైన 13-14% కంటే ఈసారి కొంచెం తక్కువగా కేవలం 10% మాత్రమే ఉంది.
OTT ప్లాట్‌ఫారమ్‌లకు పేమెంట్ చేసే యూజర్లు కూడా స్థిరంగా పెరుగుతున్నారు. టెలికాం బండిల్‌లు, అగ్రిగేటర్ల ద్వారా పొందే సబ్‌స్క్రిప్షన్‌లు కూడా కలిపి, దేశవ్యాప్తంగా యాక్టివ్ పేడ్ OTT సబ్‌స్క్రిప్షన్‌లు ఇప్పుడు సుమారు 148.2 మిలియన్లకు చేరుకున్నాయని రిపోర్ట్ చెబుతోంది. అంటే, కేవలం ఫ్రీ కంటెంట్‌కే కాకుండా, ప్రీమియమ్ కంటెంట్ కోసం కూడా చాలా మంది డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక ఈ రిపోర్ట్‌లో నిజంగా ఆశ్చర్యపరిచే అంశం Connected TV వినియోగం. ఇప్పటి వరకు భారత్‌ను మొబైల్-ఫస్ట్ మార్కెట్‌గా భావిస్తుండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రస్తుతం దేశంలో 129.2 మిలియన్ల మంది Connected TV వాడుతున్నారు. అంటే దాదాపు 35-40 మిలియన్ ఇళ్లలో Connected TVలు ఉన్నాయి. ఈ విభాగం ఒక్క ఏడాదిలోనే 87% వృద్ధిని నమోదు చేసుకోవడం గమనార్హం. అంటే, పెద్ద స్క్రీన్‌లపై, హై క్వాలిటీ వీడియో ఎక్స్‌పీరియెన్స్ కోసం ఇప్పుడు ప్రజలు స్మార్ట్ టీవీల వైపు మళ్లుతున్నారు.
ఈ రిపోర్ట్‌లో OTT ప్రేక్షకులను వయస్సు, లింగం, మీడియా అఫ్లూయెన్స్, ప్రజల స్థాయి, రాష్ట్రాలు, నగరాల వారీగా విశ్లేషించారు. అంతేకాదు, ఎవరెంత టైమ్ డిజిటల్ కంటెంట్‌పై ఖర్చు చేస్తున్నారు, వాళ్లకు ఏ భాషలు, కంటెంట్ ఫార్మాట్లు ఎక్కువగా నచ్చుతున్నాయి, రోజువారీ మీడియా అలవాట్లు ఎలా ఉన్నాయో కూడా ఈ రిపోర్ట్‌లో వివరించారు.
రిపోర్ట్ ప్రకారం, పట్టణాలు మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా OTT వినియోగం వేగంగా పెరుగుతోంది. టైర్-2, టైర్-3 నగరాలు నుంచి వచ్చే ప్రేక్షకులు సంఖ్య ఎక్కువవుతోంది. దీని వెనుక కారణం డిజిటల్ కనెక్టివిటీ పెరగడం, డేటా ప్రణాళికలు సౌకర్యవంతంగా రావడం. అందుకే కంటెంట్ తయారీదారులు ఇప్పుడు గ్రామీణ ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యే, వారి సంస్కృతి, భాషలకు దగ్గరగా ఉండే కంటెంట్ పై ఎక్కువ దృష్టి పెట్టుతున్నారు.

దీంతో, భారతీయ వినోద మార్కెట్ ఎటువైపు కదులుతోంది అన్నది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. మొబైల్ స్క్రీన్‌ల నుండి పెద్ద స్క్రీన్‌ల వైపు, ఫ్రీ కంటెంట్ నుండి ప్రీమియమ్ కంటెంట్ వైపు, షార్ట్ క్లిప్‌ల నుండి లాంగ్ ఫార్మ్ షోస్ వైపు ప్రజలు నెమ్మదిగా మారుతున్నారు. OTT వృద్ధి రేటు కొంచెం మందగించినా, భారతీయుల డిజిటల్ వినోదపు అలవాట్లు పెద్ద స్క్రీన్‌ల వైపు వేగంగా మారుతున్నాయి. ఇది భవిష్యత్తులో కంటెంట్ తయారీదారులు, OTT ప్లాట్‌ఫారమ్‌లు, బ్రాండ్‌ల స్ట్రాటజీలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications