దేశంలో కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. 21 రోజుల లాక్ డౌన్ తో అయిపోతుందిలే అనుకున్న జనాలకు దాన్ని మరో 19 రోజులకు పొడిగించటంతో నిరాశే మిగులుతోంది. ఒక వైపు ప్రాణాలను కాపాడుకోవాలంటే ఇంటికే పరిమితం కావటం తప్పనిసరి. అలాగని ఇంట్లోనే ఉంటే ఉద్యోగాలు చేసుకునేదెలా, కుటుంబాన్ని పోషించేది ఎలా అనేది మధ్యతరగతి జీవి ప్రశ్న.
గత 100 ఏళ్ళల్లో కనీ వినీ ఎరుగని సంక్షోభాన్ని ప్రస్తుతం భారత దేశం, పౌరులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచంతో పోల్చితే మన దేశంలో కరోనా బాధితులు తక్కువగానే ఉన్నప్పటికీ... నిర్లక్ష్యం చేస్తే అది కాస్త అమెరికా లో లాగా చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అందుకని ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.
కానీ 135 కోట్ల జనాభా కలిగిన ఇంత పెద్ద దేశంలో అందరి సమస్యలనూ పూర్తిస్థాయిలో తీర్చగలిగే ఆర్థిక సంపత్తి గానీ, యంత్రాంగం కానీ మనకు లేవన్నది సత్యం. అయితే ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించవద్దని, వేతనాలు తగ్గించవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలను ఆదేశిస్తోంది. ఆచరణలో అది సాధ్యం కాదని తెలిసినా.. తన పంతాన్ని నిలుపుకుంటుందా అనేదే ప్రశ్న.

షరతులు లేకుండా పీఎఫ్ ...
ఇండియా లో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్... పలు ఆర్థిక ఉద్దీపన ప్రకటనలు చేశారు. అందులో ఒకటే ఉద్యోగులకు మొత్తం పీ ఎఫ్ తామే చెల్లిస్తామని పేర్కొనటం. అయితే, దానికి ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ఒక కంపెనీలో 100 మంది ఉద్యోగులు ఉండి అందులో 90% మంది నెల జీతం రూ 15,000 లోపు ఉంటె వారందరికీ ప్రభుత్వమే పీ ఎఫ్ చెల్లిస్తుందని నిర్మల సీతారామన్ ప్రకటించింది.
కానీ, అలాంటి కంపెనీలు భూతద్దంలో పెట్టి వెతికినా దొరకటం కష్టం. ఒక కంపెనీ 100 మంది ఉద్యోగుల స్థాయికి ఎదిగిందంటేనే అది కొంత స్థిరపడినట్లే. ప్రస్తుత కాలంలో అలాంటి కంపెనీల్లో సగటు వేతనాలు రూ 30,000 గా ఉంటున్నాయి. ఇక 90% మంది వేతనాలు రూ 15,000 లోపు ఉండటం అనేది అరుదు. అందుకే, ఇలాంటి పనికిరాని షరతుల కంటే అందరికీ ప్రయోజనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

6 కోట్ల మందికి ప్రయోజనం...
మన దేశంలో ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ పథకంలో సుమారు 6 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. వారంతా నెలకు తమ మూల వేతనం నుంచి 12% ఈ ఖాతాలకు చెల్లింపులు చేస్తుండగా.. కంపెనీ మరో 12% జమ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలే పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంత గట్టిగా చెప్పినా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించటం, లేదా వేతనాలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. అందుకే, ఇలాంటి సమయంలో ప్రభుత్వమే 3 నెలల పాటు ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ సొమ్ము జమ చేస్తే... సుమారు 6 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు అంటున్నారు.

కోతలు మొదలు...
ఇప్పటికే చాలా కంపెనీల్లో సగటున 20% నుంచి 25% వేతనాల్లో కోత మొదలైంది. ఇది ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. అసలే పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో జీతాలు పెరగక పోగా తగ్గటం అంటే.. ఎంత పెద్ద సంక్షోభంలో ఉన్నామో తెలిసిపోతోంది. కనీసం జీతం పెరగక పోయినా.. ఫరవా లేదు కానీ తగ్గటం అనేది చాలా కష్టమైన పని. అన్ని ఖర్చులను 20-25% తగ్గించుకోవటం అసాధ్యం. అయితే, ఈ మేరకు 24% ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వమే భరిస్తే... తప్పకుండ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల విషయంలో కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు లేకపోలేదని మానవ వనరుల నిపుణులు పేర్కొంటున్నారు. లేదంటే, చాలా మంది ఉద్యోగాలు పోయే పరిణామం దాపురించవచ్చని హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications